ఆ మధ్య యాక్సిడెంట్ హడావుడితో వార్తల్లోకి ఎక్కిన హీరో రాజ్ తరుణ్ చేతిలో వున్న రెండో సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. రెండో సినిమాను కొండా విజయ్ కుమార్ డైరక్షన్ లో చేయబోతున్నారు. సత్యసాయి ఆర్ట్స్ కెకె రాధామోహన్ నిర్మాత.
మాళవిక శర్మ కథానాయికగా నటించే ఈ సినిమాకు 'ఓరే బుజ్జీ ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి బుజ్జిగాడు అనే టైటిల్ అనుకున్నారు కానీ గతంలో ప్రభాస్ హీరోగా ఈ పేరుతో సినిమా వచ్చినందున, ఆప్షనల్ టైటిల్ గా ఒరే బుజ్జీ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.
ఇప్పటికే పూజ చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 10 నుంచి సెట్ మీదకు వెళ్తుంది. వాస్తవానికి ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా రాజ్ తరుణ్ అనుకోని హడావుడి వల్ల లేట్ అయినట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాణంలోని సినిమాకు గ్యాప్ రావడంతో, ఈ సినిమా ఆలస్యం అయింది.