వాల్మీకి ఓవర్ సీస్ @ 2.5 కోట్లు

హరీష్ శంకర్-వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా వాల్మీకి. ఈ సినిమా బిజినెస్ చకచకా ఫినిష్ చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రను 10 కోట్ల రేషియోలో మార్కెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓవర్ సీస్ కూడా…

హరీష్ శంకర్-వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా వాల్మీకి. ఈ సినిమా బిజినెస్ చకచకా ఫినిష్ చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రను 10 కోట్ల రేషియోలో మార్కెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓవర్ సీస్ కూడా క్లోజ్ చేసారు. యుఎస్ తెలుగుసంస్థ 2.5 కోట్లకు ఈ హక్కులను తీసుకుంది. ఇందులో కొంత మొత్తం రికవరబుల్ వుంటుదని తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో రెండున్నర కోట్లు ఓవర్ సీస్ అమౌంట్ అంటే దాదాపు ఎక్కువే. అయితే కాస్త రికవరీ హామీ వుండడంతో తీసుకున్నట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ ఈ సినిమాకు అదనపు హంగులు అద్దుతూ బజ్ బాగానే తీసుకువచ్చారు. పైగా హరీష్ ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ బాగానే చేస్తారనే టాక్ కూడా వుంది.

అందువల్ల ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఫరవాలేదు. యుఎస్ తెలుగుసంస్థ ఇటీవలే ఎవరు సినిమాను ఓవర్ సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేసి సక్సెస్ కొట్టింది.

సినిమా రివ్యూ: సాహో