కేసీఆర్ నాయకత్వంపై ఎనీ డౌట్స్!

నిప్పులేనిదే పొగరాదని సామెత. ఇప్పుడు పొగమాత్రం పుష్కలంగా వస్తోంది. కానీ దాని దిగువన నిప్పు ఉన్నదా లేదా అనేది మాత్రం క్లారిటీ రావడంలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాజకీయాల్లో గుంభనంగా ఏదో జరుగుతోంది..…

నిప్పులేనిదే పొగరాదని సామెత. ఇప్పుడు పొగమాత్రం పుష్కలంగా వస్తోంది. కానీ దాని దిగువన నిప్పు ఉన్నదా లేదా అనేది మాత్రం క్లారిటీ రావడంలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాజకీయాల్లో గుంభనంగా ఏదో జరుగుతోంది.. అని మాత్రం అనిపిస్తోంది. ఏం జరుగుతోందనే క్లారిటీలేదు.

ఒకరు నోరుజారి మాట్లాడారేమో అనుకోవచ్చు. కానీ.. మరొకరు అదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తూనే.. ‘అబ్బెబ్బే అలాంటిదేమీ లేదు’ అంటున్నారంటే.. అనుమానం కలుగుతుంది. గులాబా దళపతి కేసీఆర్ కు పార్టీ మీద ఏకచ్ఛత్రాధిపత్యం ఉంది. ఆయన మాటకు ఎదురు చెప్పేవారు గానీ, ఆయన ఆదేశాన్ని మీరి మనగలిగే వారు గానీ ఆ పార్టీలో లేరు. కానీ ఇటీవలి కాలంలో మంత్రి ఈటల రాజేందర్ చుట్టూ ముసురుకుంటున్న వివాదం.. ప్రజలకు రకరకాల అనుమానాలు కలిగిస్తోంది.

మంత్రిని కేబినెట్ నుంచి తొలగిస్తారని ఒక ప్రచారం జరిగింది. ఈలోగా ఆయన తన నియోజకవర్గంలో కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘గులాబీ జెండా మాదే’ అనే అర్థం వచ్చేలాగా మాట్లాడారు. ఈ పార్టీ కేసీఆర్ సొత్తు కాదు.. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన మా అందరిదీ అని అర్థం వచ్చేలాగా ఈటల మాటలు ధ్వనించాయి. తెరాస పార్టీ అంతర్గత రాజకీయాలు ఒక్కసారిగా అట్టుడికి పోయాయి. సాయంత్రానికే ఈటల ‘మా నాయకుడు కేసీఆరే’ అని చెప్పాల్సి వచ్చింది. అంటే.. ఉదయం మాట్లాడిన మాటలు కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించేలాగానే ఉన్నాయనేది మరింత స్పష్టమైంది.

ఇవాళ పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా ముందుకు వచ్చి… ‘గులాబీ జెండాకు కేసీఆరే బాస్’ అని నొక్కి వక్కాణిస్తున్నారు. అద్సరేగానీ.. కాదని ఎవరన్నారు. ఆయన అలా నొక్కి చెప్పవలసిన అవసరం ఏంటి? ఈ విషయంలో ప్రజల్లో అనుమానాలు ప్రబలుతున్నాయని, తాము నివృత్తి చేయవలసిన అవసరం ఉన్నదని ఎర్రబెల్లి భావిస్తున్నారా? అని అనిపిస్తోంది.

గులాబీజెండాకు కేసీఆర్ ఒక్కరే ఓనర్- అని ఆయన అంటున్నారు. ఇవన్నీ పార్టీలో చీలికభయంతో మాట్లాడుతున్న మాటల్లాగానే ఉన్నాయి. ఈటల అంశం సమసిపోయిందని, ఆయన మంత్రి పదవికి ఎలాంటి ఢోకా లేదని అంటూనే.. ఈటల మాటల వివాదానికి ఈయన క్లారిటీ ఇవ్వడం ఏంటో అర్థంకాని సంగతి.

సినిమా రివ్యూ: సాహో