రాజ్ తరుణ్ ట్రయిలర్ ఓ లుక్కేస్తే

అన్నపూర్ణ బ్యానర్ పై రాజ్ తరుణ్ హీరోగా సినిమా అంటనే సమ్ థింగ్ స్పెషల్ అని డిసైడ్ అయిపోవచ్చు. రాజ్ తరుణ్ తొలి సినిమా ఉయ్యాల జంపాల సినిమా అక్కడి నుంచే వచ్చిందిగా. ఇప్పడు…

అన్నపూర్ణ బ్యానర్ పై రాజ్ తరుణ్ హీరోగా సినిమా అంటనే సమ్ థింగ్ స్పెషల్ అని డిసైడ్ అయిపోవచ్చు. రాజ్ తరుణ్ తొలి సినిమా ఉయ్యాల జంపాల సినిమా అక్కడి నుంచే వచ్చిందిగా. ఇప్పడు మరోసారి రాజ్ తరుణ్ తో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా రంగులరాట్నం సినిమా వస్తోంది. జనవరి 14న విడుదలకు ముస్తాబు చేస్తున్నారు.

ఈ సినిమా ట్రయిలర్ రెడీ అయిపోయింది. ఈమధ్య రాజ్ తరుణ్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్నా, ఎక్కడో అవి ఉయ్యాల జంపాల మాదిరిగా కనెక్ట్ కావడం లేదు. మళ్లీ రంగులరాట్నం సినిమా ఆ లోటు తీర్చేలా కనిపిస్తోంది ట్రయిలర్ చూస్తుంటే.

శ్రీరంజని అనే కొత్త లేడీ డైరక్టర్ అందించిన ఈ సినిమా ఈకాలపు యూత్ ప్రేమ అనే జోనర్ చుట్టూ తిరుగుతున్నట్లు తెలిసిపోతోంది ట్రయిలర్ చూస్తుంటే.

ప్రేమ పేరుతో అమ్మాయిలు పెట్టే కండిషన్లు, దానికి విసిగిపోతూనే, అదే కావాలనుకునే అబ్బాయి. ఈ సీన్లు అన్నీ బాగానే కుదిరినట్లు కనిపిస్తోంది ట్రయిలర్ చూస్తుంటే. తల్లి దగ్గర తమ ఇష్టాలుగా వుండే కుర్రాళ్ల ఇష్టాలు, ప్రేమ దగ్గరకు వచ్చేసరికి ప్రేయసి ఇష్టాలుగా మారిపోవడం అన్న పాయింట్, ప్రేమ చుట్టూ అల్లుకునే కండిషన్లు, దానివల్ల వచ్చే ఎమోషన్లు ట్రయిలర్ లో బాగానే కట్ చేసారు.

ట్రయిలర్ లో రాజ్ తరుణ్ కాస్త బుగ్గులతో చబ్బీగా కనిపిస్తున్నాడు. రాజ్ తరుణ్ సరసన నటించిన చిత్ర శుక్ల తన క్యారెక్టర్ కు ఫిట్ అన్నట్లు కనిపిస్తోంది.