అజ్ఞాతవాసి ఫోస్ట్ ప్రొడక్షన్ పూర్తి

అజ్ఞాతవాసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయినట్లే. విడుదలకు ఇంకా ఆరురోజులు దూరంలో వుండగానే రీరికార్డింగ్, మిక్సింగ్ వంటి పనులు అన్నింటినీ చెన్నయ్ లో దర్శకుడు త్రివిక్రమ్ దగ్గర వుండి పూర్తి చేయించారు. 4వ…

అజ్ఞాతవాసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయినట్లే. విడుదలకు ఇంకా ఆరురోజులు దూరంలో వుండగానే రీరికార్డింగ్, మిక్సింగ్ వంటి పనులు అన్నింటినీ చెన్నయ్ లో దర్శకుడు త్రివిక్రమ్ దగ్గర వుండి పూర్తి చేయించారు. 4వ తేదీన చిన్న చిన్న పనులు ఫినిష్ చేసి, తిరిగివస్తారు. అంటే అయిదవ తేదీకి ఓవర్ సీస్ కాపీలు లోడింగ్ కు రెడీగా వుంటాయన్నమాట.

ఇంకా రెండు పనులు సినిమా ప్రమోషన్ కు సంబంధించి మిగిలివున్నాయి. ఒకటి ట్రయిలర్ విడుదల, రెండవది బెంగళూరులో ప్రమోషన్ ఈవెంట్. ట్రయిలర్ సెన్సారు బుధవారం షెడ్యూలు అయివుంది. కానీ అయినట్లు వార్తలేవీ రాలేదు. గురువారం విడుదల చేసే అవకాశం వుందని తెలుస్తోంది. ఒక పెద్ద సినిమాకు విడుదల ఇంతలా దగ్గరపడినా ట్రయిలర్ విడుదల కాకపోవడం ఇదే ప్రథమం ఏమో? పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ క్రేజ్ కారణంగా ట్రయిలర్ గురించి అస్సలు ఎవరూ ఎదురు చూడకుండానే, టికెట్ ల బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. 

9వ తేదీ అర్థరాత్రి దాటిన తరువాత స్పెషల్ షోలు వేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇక బెంగళూరు పోగ్రామ్ ఎప్పుడు ఏమిటి అన్నది త్రివిక్రమ్ చెన్నయ్ నుంచి వచ్చిన తరువాత పవన్ ను కలిసి ఫిక్స్ చేసే అవకాశం వుంది. విదేశాల్లో పెద్ద సంఖ్యలో స్క్రీన్ లు వేయడంతో వీలయినంత త్వరగా అన్నీ పూర్తి చేయాలని సెన్సారుతో సహా అన్నీ ఫినిష్ చేసారు. దాంతో సినిమా విశేషాలు ఎలాపడితే అలా బయటకు వస్తున్నాయి. అయితే పవన్-త్రివిక్రమ్ సినిమా కాబట్టి ఇవేవీ అంత ప్రభావం చూపించవు. 

సినిమా లెంగ్త్ రెండుగంటల 38 నిమిషాలు అని సర్టిఫికెట్ చెబుతోంది. విశ్రాంతి గ్యాప్ తో కలుపుకుంటే, దగ్గర దగ్గర మూడుగంటల సమయం అన్నమాట.