రాజ రాజ చోర..శ్రీవిష్ణు

వైవిధ్యమైన చిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ హీరో శ్రీవిష్ణు. అతనేంటో, అతని సినిమాలేంటో, భలే చిత్రమైన ప్రయత్నాలు చేస్తూ వుంటాడు. హిట్ లు వచ్చాయి, ఫ్లాపులు వచ్చాయి. వాటి సంగతి పక్కన పెడితే, శ్రీవిష్ణు…

వైవిధ్యమైన చిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ హీరో శ్రీవిష్ణు. అతనేంటో, అతని సినిమాలేంటో, భలే చిత్రమైన ప్రయత్నాలు చేస్తూ వుంటాడు. హిట్ లు వచ్చాయి, ఫ్లాపులు వచ్చాయి. వాటి సంగతి పక్కన పెడితే, శ్రీవిష్ణు సినిమా అంటే కాస్త ఆసక్తి అనేది పుట్టేలా చేయగలిగాడు. 

ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నట్లు కనిపిస్తోంది. టైటిల్ దగ్గరే వైవిధ్యం, వెటకారం కనిపిస్తోంది. పైగా ఫస్ట్ లుక్ లో శ్రీవిష్ణు గెటప్ కూడా భిన్నంగా వుంది. కృష్ణుడి గెటప్ వేసుకుని, గాల్లో తేలేంతగా పరుగెడుతూ వెళ్లడం, చోర అన్న టైటల్ చూస్తుంటే మాంచి ఫన్ సబ్జెక్ట్ ఎన్నుకున్నట్లే వుంది. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకుడు. సునయన నాయిక. గతంలో వివేక్ ఆత్రేయ దగ్గర సహాయకుడిగా పనిచేసిన హసత్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. తన శిష్కుడి కోసం వివేక్ ఆత్రేయ కూడా తెరవెనుక రచన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు బోగట్టా. 

ఒక వినూత్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్  షూటింగ్ జరుపుకుంటోంది అని తెలిపారు చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఏప్రిల్ నాటికి చిత్ర షూటింగ్ కార్యక్రమాలు పూర్తవుతాయని తెలిపారు సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల,క్రియేటివ్ ప్రొడ్యూసర్ కీర్తి చౌదరి.

పోలవరం ప్రాజెక్ట్ స్పీడ్ పెంచిన వైఎస్ జగన్

క్రైమ్ జరగక ముందే ఆపడానికి వచ్చే టీం