రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా సినిమా రంగంలో కొనసాగాలని డిసైడ్ అయిపోయాడు. నాన్న చాటు బిడ్డగా వుంచి చేయడం వేరు. ఇప్పుడు తొలిసారిగా నేరుగా అన్నీ తానే అయి యుద్ధం శరణం సినిమాను రూపొందించాడు. నిర్మాత సాయి కొర్రపాటే కావచ్చు కానీ, నిర్మాణ వ్యవహారాల బాధ్యతలు అన్నీ తనమీదే వేసుకుని చూసుకున్నాడు.
అంతే కాదు, కాస్త క్రియేటివ్ బ్రెయిన్ కావడంతోనూ, సినిమా డైరక్టర్ దగ్గర నుంచి అందరూ కుర్ర బ్యాచ్ కావడంతో, అందరితో కలిసిపోయి, అన్ని శాఖల్లో వీలయినంత బెస్ట్ పని తీరు రాబట్టుకోవడానికి కిందా మీదా పడ్డాడు. సాయి కొర్రపాటి కూడా కుర్రాళ్లు, ఏదో సమ్ థింగ్ ట్రయ్ చేస్తున్నారని, ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
నాగ్ చైతన్య హీరోగా, శ్రీకాంత్ విలన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలకు సిద్ధం అయిపోయింది. చైతన్య క్లాస్ మేట్ అయిన కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమాతో మళ్లీ శ్రీకాంత్ తన విలన్ ట్రాక్ లోకి అడుగుపెడుతున్నాడు.
చైతూ డ్రోన్స్ స్పెషలిస్ట్ గా కనిపిస్తాడు. డ్రోన్స్ సాయంతోనే విలన్ ఆట కట్టించి, పగ తీర్చుకుంటాడు. మరి ఈ సీన్లు అన్నీ ఎలా వచ్చాయి, ఎలా ప్లాన్ చేసారు అన్నదాని మీద సినిమా ఫలితం ఆధారపడి వుంటుంది. చైతూ మేనమామ సురేష్ బాబు ఓకే చేసిన స్క్రిప్ట్ ఇది. అక్కడి నుంచి ఇక్కడకు వచ్చింది.
సాధారణంగా సురేష్ బాబు ఓకె చేసారు అంటే విషయం ఎంతో కొంత వుంటుంది. అందువల్ల ఈ సినిమా మీద హోప్స్ కొంతవరకు వున్నట్లే అనుకోవాలి. ఏమయినా ఈ సినిమా హిట్ అయితే రాజమౌళి సన్ కార్తికేయకు కూడా ఇంతో అంతో పేరు వస్తుంది. అనుభవం ఎలాగూ వస్తుంది. ఇకపై నిర్మాణ రంగంలో కొనసాగవచ్చు. ప్రస్తుతం రాజమౌళి ఫ్యామిలీలో అందరు టెక్నీషియన్లు వున్నారు. నిర్మాతలు లేరు. ఆ లోటు భవిష్యత్ లో కార్తికేయ తీరుస్తాడేమో?