రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్ సినిమా మీద వచ్చిన గ్యాసిప్ ల్లో కీలకమైనది ఒకటి వుంది. ఆ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ పనిచేయడం లేదన్నది ఆ గ్యాసిప్. అయితే ఇప్పుడు యూనిట్ వర్గాల నుంచి క్లారిటీ వచ్చింది. మళ్లీ సెంథిల్ కుమార్ తోనే రాజమౌళి తన సినిమా చేస్తున్నాడు.
ఆ ఇద్దరిదీ అపూర్వబంధం. చాలా సినిమాలు చేసారు. ఇటీవల సెంధిల్ కుమార్ రంగస్థలం సినిమా చేసి మరింత పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి సైరా సినిమా కూడా చేస్తున్నాడు. రాజమౌళి కోసమే, ఆయన సన్నిహితుడు సాయి కోర్రపాటి నిర్మిస్తున్న మెగా అల్లుడి విజేత సినిమా చేస్తున్నాడు.
ఇలాంటి నేపథ్యంలో రామ్ చరణ్-ఎన్టీఆర్ సినిమా సెంథిల్ చేయడం లేదని వార్తలు గట్టిగా బయటకు వచ్చాయి. దీనిపై ఇటు సెంథిల్ కానీ, అటు రాజమౌళి కానీ మాట్లాడకపోవడంతో, నిజమే అన్న అభిప్రాయం కలిగింది.
వాస్తవం ఏమిటంటే, ఈసారి సెంథిల్ తో కాకుండా వేరే వాళ్లతో ట్రయ్ చేయాలని దర్శకుడు రాజమౌళి కూడా అనుకున్నాడట. కానీ మళ్లీ ఏమయిందో ఇప్పుడు మనసు మార్చకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి కూడా తనకు అన్ని విదాలా కెమిస్ట్రీ, వర్కింగ్ స్టయిల్ సెట్ అయిన సెంథిల్ కుమార్ తోనే ముందుకు వెళ్లాలని రాజమౌళి నిన్నటికి నిన్న డిసైడ్ అయినట్లు తెలిసింది.
నవంబర్ నుంచి సెట్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ బాక్సర్ గా, చరణ్ హార్స్ రైడర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ నిర్మాణం జరుగుతోంది. అలాగే రామోజీ ఫిలిం సిటీలో కూడా కొంత పార్ట్ షూటింగ్ వుంటుంది.