రాజమౌళి-పబ్లిసిటీ అతి

ఎవరైనా తండ్రికి కొడుకే. అది రాజమౌళి కావచ్చు. మరొకరు కావచ్చు. అలాగే కొడుకు అన్నవాడికి తండ్రిపై గౌరవం, అభిమానం వుండకుండాపోవు. ఎక్కడో తప్పిజారి ఒకటి రెండు కేసులు వుండోచ్చు. కానీ ఆ అభిమానాన్ని, గౌరవాన్ని…

ఎవరైనా తండ్రికి కొడుకే. అది రాజమౌళి కావచ్చు. మరొకరు కావచ్చు. అలాగే కొడుకు అన్నవాడికి తండ్రిపై గౌరవం, అభిమానం వుండకుండాపోవు. ఎక్కడో తప్పిజారి ఒకటి రెండు కేసులు వుండోచ్చు. కానీ ఆ అభిమానాన్ని, గౌరవాన్ని పబ్లిసిటీగా వాడుకుంటే, భలే నవ్వు వస్తుంది. 

మొన్న శ్రీవల్లి అడియో ఫంక్షన్ లో రాజమౌళి చూపించిన బ్రహ్మోత్సవం సినిమా ఇలాగే వుంది. తండ్రి విజయేంద్ర ప్రసాద్ షూ లేస్ ఊడిపోతే, రాజమౌళి వేదికమీదే టక్కున కింద కూర్చుని కట్టేయడం, దాన్ని మన మీడియా మరీ అతిగా మోసేయడం. అదేదో అద్భుతం జరిగిపోయినట్లు? ఇంకెవరికీ తండ్రి మీద అంతటి ప్రేమ లేదన్నట్లు? తను కింద కూర్చుని తండ్రి షూ లేస్ కడితే మీడియా ఏ రేంజ్ లో స్పందిస్తుందో రాజమౌళికి తెలియంది కాదు. అవకాశం కనిపించింది. చాలా తెలివిగా అటెన్షన్ డ్రా చేసేసాడు. 

భార్య-భర్త, తండ్రీ కొడుకు, ఇలాకొన్ని అనుబంధాలు పబ్లిక్ గా చాటుకునేవి కాదు. ఇంటికి, మనసుకి పరిమితం చేసుకునేవి. వాటిని కూడా ఇలా పబ్లిసిటీకి వాడుకోవడం ఏమిటో? అదే అడియో ఫంక్షన్ లో తన పేదరికం గురించి ఏకరవు పెట్టారు రాజమౌళి. ఎవరు అడిగారు? ఫంక్షన్ అదికాదుకదా? కష్టాల కడలి దాటకుండా ఎవరూ పెరిగి పెద్దయిపోరు. కష్టం సైజులో తేడా వుంటుందంతే. కానీ పదే పదే రాజమౌళి అండ్ కో అదే చెబుతుంటే, జనాలకు బోర్ కొడుతుంది. ఎందుకంటే మన అభిమానాలు మన ఇంట్లో వుండాలి. పబ్లిక్ లో కాదు. పెళ్లాంపై ప్రేమను పబ్లిక్ లో చూపిస్తే ఎలా వుంటుందో? ఇదీ అంతే అతిగా వుంటుంది.