పవన్ పార్ట్ టైమ్ రాజకీయవేత్త. అది వాస్తవం. అందుకే ఆయన ఫుల్ టైమర్ గా వర్తమాన రాజకీయాలపై స్పందించరు. ఆయనకు నచ్చిన వాటిపై, నచ్చిన రీతిలో, నచ్చినపుడు స్పందిస్తారు. అంతవరకు వెయిట్ చేయడమే. అలా మళ్లీ స్పందిస్తారన్న గ్యారంటీ లేదు.
చాలా మందికి కీలకం అనిపించిన సంఘటనలు ఆయనకు అత్యల్పంగా వుంటాయేమో? అందుకే స్పందించరేమో తెలియదు. దేశం అంతా సంచలనం సృష్టించిన ముమ్మారు తలాఖ్ అనే దానిపై నిర్ణయం వుండనే వుంది. కానీ దానిపై దేశం యావత్తూ స్పందించినా, మంచో, చెడో చెప్పినా పవన్ బాబు మాత్రం స్పందించరు. అలా అయిన జనసేన అనే రాజకీయ పార్టీకి స్పోక్స్ పర్సన్ వుండరు. పార్టీ వైఖరి స్పష్టం చేయరు. మొండివాడు రాజుకన్నా బలవంతుడు అనే టైపులో.
తోటి కళాకారుడు, సూపర్ స్టార్ రజనీ తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసారు. కనీసం కర్టెసీ కోసమన్నా స్వాగతం అన్న చిన్న ట్వీటు కూడా కనిపించదు. అన్నట్లు ఆయన సోదరుడు, జనసేనకు మూలమైన ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కూడా స్పందించినట్లు లేదు ఇంకా.
ఏమిటో వీళ్లంతా తాము అంతా స్పేషల్ క్యాటగిరీ అని అనుకుంటారో ఏమిటో? లేక పవన్ ట్వీటడానికి కూడా త్రివిక్రమ్ కు, ఆయన కు కామన్ గురువు అయిన పెద్దమనిషి ముహుర్తం పెట్టాలేమో?