తమిళంలో విష్ణు విశాల్ నటించిన సినిమా రాక్షసన్. ఈ సినిమాను తెలుగులోకి తీసుకువస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వున్నాయి. చిన్న సినిమాగా విడుదలై 20 కోట్ల మేరకు వసూలు చేసింది. ఈ సినిమా హక్కులు హీరో నితిన్ కొన్నాడని, అతనే హీరోగా రీమేక్ చేస్తారని ఆ మధ్య వార్తలు వచ్చాయి.
అయితే లేటెస్ట్ గా ఈ సినిమా చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచన ఆగలేదు. కానీ హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్మాత, డైరక్టర్ ఎవరు అన్నది ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికి బెల్లంకొండ శ్రీనివాస్ అయితే ఈ సబ్జెక్ట్ కు ఓకె అన్నట్లు తెలుస్తోంది.
బెల్లంకొండ ప్రస్తుతం తేజ డైరక్షన్ లో ఒకటి, రమేష్ వర్మ డైరక్షన్ లో మరోటి, అలాగే ఆర్ ఎక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతి డైరక్షన్ లో ఓ సినిమా ఓకె అన్నాడు. ఇదికాక కొత్త డైరక్టర్ సినిమా ఒకటి ప్లానింగ్ లో వుంది. మరి వీళ్లలో ఎవరి చేతిలో రాక్షసన్ బాధ్యతలు పెడతాడో చూడాలి.