రామ్ చరణ్ కు ఎంతమంది తమ్ముళ్లు?

బోయపాటి డైరక్షన్ లో డివివి దానయ్య నిర్మించే రామ్ చరణ్ సినిమా లాంఛనంగా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. బోయపాటి అంటే కథలు కాస్త టిపికల్ గా భారీగానే వుంటాయి. అందువల్ల సినిమాలో క్యారెక్టర్లు…

బోయపాటి డైరక్షన్ లో డివివి దానయ్య నిర్మించే రామ్ చరణ్ సినిమా లాంఛనంగా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. బోయపాటి అంటే కథలు కాస్త టిపికల్ గా భారీగానే వుంటాయి. అందువల్ల సినిమాలో క్యారెక్టర్లు కూడా కాస్త ఎక్కువే వుంటాయి.

ఈసినిమాలో కూడా అలాగే బోలెడు క్యారెక్టర్లు వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళ మాజీ హీరో ప్రశాంత్ ఓ క్యారెక్టర్ కు ఎంపికైనట్లు వార్తలు వడ్డాయి. రామ్ చరణ్ కు అన్నగానో, తమ్ముడిగానో ప్రశాంత్ ఈసినిమాలో కనిపిస్తాడు.

ఇదిలా వుంటే తెలుగులో రెండు మూడు సినిమాలు చేసి, మెల్లగా క్యారెక్టర్ల వైపు మళ్లుతున్న హీరో నవీన్ చంధ్ర కూడా ఓ క్యారెక్టర్ కు ఎంపికైనట్లు వార్తలు వినవస్తున్నాయి. నవీన్ కూడా రామ్ చరణ్ కు సోదరుడిగానే కనిపిస్తాడట. అది కూడా తమ్ముడిగా అని టాక్.

మరి సినిమాలో రామ్ చరణ్ ది ఎంత భారీ కుటుంబమో, ఎంతమంది అన్నదమ్ములో? బోయపాటి కాస్త భారీ కథనే ఎప్పటి మాదిరిగా వండి వార్చినట్లు కనిపిస్తోంది.