రామ్ చరణ్ సరైన ఛాయిస్

ఎంతవాడుగానీ సినిమా గుర్తుందిగా..హీరో అజిత్ తో సమంగా పెర్ ఫార్మ్ చేసి, శభాష్ అనిపించుకున్నాడు విలన్ అరుణ్ విజయ్. ఇతగాడు మల్టీ టాలెంటెడ్. సింగర్, స్టంట్ కో ఆర్డినేటర్, అంతే కాదు..మంజుల భర్త విజయకుమార్…

ఎంతవాడుగానీ సినిమా గుర్తుందిగా..హీరో అజిత్ తో సమంగా పెర్ ఫార్మ్ చేసి, శభాష్ అనిపించుకున్నాడు విలన్ అరుణ్ విజయ్. ఇతగాడు మల్టీ టాలెంటెడ్. సింగర్, స్టంట్ కో ఆర్డినేటర్, అంతే కాదు..మంజుల భర్త విజయకుమార్ తొలి భార్య కుమారుడు ఇతగాడు. ఇద్దరుపిల్లల తండ్రి.

ఈ వైనాలన్నీ అలా వుంచితే, నటనలో మాత్రం చించి ఆరేస్తాడు. అందుకే ఇప్పుడ శ్రీనువైట్ల కన్ను ఇతగాడి మీద పడిందని వినికిడి. రామ్ చరణ్ తో దానయ్య నిర్మిస్తున్న సినిమాలో విలన్ గా ఎంపిక చేసారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. దసరాకు ఎలాగైనా విడుదల చేయాలన్న పట్టుదలతో వేగంగా తెరకెక్కిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.