Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రామ్ చరణ్ తో ఆ సినిమా

రామ్ చరణ్ తో ఆ సినిమా

ఎన్టీఆర్ కోసం దర్శకుడు త్రివిక్రమ్ ఓ పాన్ ఇండియా లెవెల్ భారీ సినిమా ఐడియా చెప్పిన సంగతి తెలిసిందే. 

కానీ అరవింద సమేత, ఆర్ఆర్ఆర్ లాంటి ఎమోషనల్ యాక్షన్ సినిమాలు చేసిన తరువాత వెంటనే మళ్లీ అలాంటి సినిమా వద్దు అని, ఫక్కా ఫ్యామిలీ సబ్జెక్ట్ కావాలని అడిగాడు ఎన్టీఆర్ అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే ఫిక్స్ అయింది. త్రివిక్రమ్ చెప్పిన ఫ్యామిలీ లైన్ కు ఎన్టీఆర్ ఓకె అన్నారు.

ఇప్పుడు దానికి సీన్లు అల్లి, స్క్రిప్ట్ తయారీ చేసి, ఆఫై డైలాగ్ వెర్షన్ రెడీ చేయాల్సి వుంది త్రివిక్రమ్. ఇదంతా ఓ ప్రాసెస్. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చేలోగా ఆ పని పూర్తి చేస్తారు. ఇదిలా వుంటే ఎన్టీఆర్ కు చెప్పిన పాన్ ఇండియా భారీ సినిమా లైన్ కూడా చాలా బాగా వచ్చిందట. 

ఆ లైన్ ను అలా వుంచి, దాన్ని మరే హీరో తో అన్నా తన తొలి పాన్ ఇండియా సినిమాగా చేయాలని ఫిక్స్ అయ్యారట త్రివిక్రమ్. వీలయితే ఎన్టీఆర్ సినిమా తరువాత దాన్ని రామ్ చరణ్ తో చేయాలన్న ఆసక్తితో వున్నారట. దాన్ని హారిక హాసిని బ్యానర్, పవన్ కళ్యాణ్ బ్యానర్ కలిపి నిర్మించే అవకాశం వుంది..

విక్ర‌మార్కుడు కంటే ప‌వ‌ర్ పుల్

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?