రామ్ చరణ్ తాను పోషించే పాత్రల కోసం బాగానే కష్టపడుతుంటాడు. ధృవ చిత్రానికి ఆ ఫిజిక్ తెచ్చుకునేందుకు అతడు పడ్డకష్టాన్ని తెరమీదే చూసాం. రంగస్థలంలో చిట్టిబాబుగా మారడానికి కూడా చరణ్ చాలానే శ్రమించాడు. అయితే తన సినిమాలని అనుకున్న టైమ్‌కి పూర్తి చేయడంలో మాత్రం చరణ్ బద్ధకంగా వ్యవహరిస్తాడనే పేరుంది.
షూటింగ్స్‌కి డుమ్మా కొడుతుంటాడని, షూటింగ్ మొదలైన దశలో చాలా తాపీగా వ్యవహరిస్తాడని, చివర్లో డెడ్‌లైన్స్ మీట్ అవడానికి దర్శకులని ఒత్తిడికి గురి చేస్తాడనే టాక్ బాగా వుంది. చరణ్ ప్రతి సినిమాకీ లాస్ట్ మినిట్ టెన్షన్స్ తప్పడం లేదు. ధృవ దసరా రిలీజ్ మిస్ అయి డిసెంబర్‌కి వెళితే, రంగస్థలం సంక్రాంతి నుంచి మార్చికి వెళ్లింది.
అంతకుముందు సినిమాలకి చివర్లో దర్శకులు నానా తంటాలు పడి డెడ్‌లైన్ మీట్ అవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమా కూడా బిహైండ్ ది షెడ్యూల్ రన్ అవుతోంది. చాలాకాలంగా నిర్మాణంలో వున్నా కానీ చరణ్ తాపీగా పనిచేయడం మూలానే లేట్ అయిందనే రూమర్ కూడా వుంది. దర్శకులని ఫ్రస్ట్రేట్ చేయడం, వారిపై ఒత్తిడి పెంచి అదనపు టెన్షన్ పెట్టడం అన్ని వేళలా తగదు కదా చెర్రీ.