థియేటర్ నా? ఓటిటి నా? అనే వాదనలు కొనసాగుతూ వుండగానే, ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ లు దూసుకుపోతున్నాయి. టీవీ వచ్చిన దశాబ్దాల కాలానికి కానీ దాన్ని యాక్సెప్ట్ చేసి, చిన్న తెర మీదకు రావడానికి తట పటాయించిన సినిమా జనాలు, ఇప్పుడు ఆ తప్పు చేయడం లేదు.
సినిమాను ఓటిటి అధిగమించే రోజు ఎంతో దూరంలో లేదని తెలుసుకుని అటు అడుగేస్తున్నారు. గేమ్ షో లు, చాట్ షోలు ఇఫ్పటికే చేసారు. వెబ్ సిరీస్ ల్లో కనిపించారు.
సీనియర్ హీరో వెంకటేష్, యంగ్ హీరో రానా కలిసి ఓ వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ కోసం చేయడానికి డిసైడ్ అయిపోయారు. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన వార్తలు గతంలోనే గ్యాసిప్ లుగా వినిపించాయి. ఇప్పుడు వాటినే నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ధృవీకరించింది.
పాపులర్ అమెరికా షో టైమ్ వెబ్ సిరిస్ 'రేదోనోవన్' కు అఫీషియల్ అడాప్షన్ గా ఈ వెబ్ సిరీస్ తయారవుతోందని వెల్లడించింది. దీనికి రానా నాయుడు అనే పేరు పెట్టారు. దీన్ని లోకోమోటివ్ గ్లోబల్ ఇన్ కార్పొరేషన్ సంస్థ నిర్మిస్తుంది. కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ దర్శకత్వం వహిస్తారు. మార్చి నాటికి ఈ వెబ్ సిరీస్ రెడీ అవుతుందని తెలుస్తోంది.