నేరుగా ఓటిటిలో విడుదలకు సినిమాలూ ఆసక్తిగానే వున్నాయి. సినిమాలు తీసుకోవడానికి ఓటిటి సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. అయితే కార్పొరేట్ సంస్థలు కావడంతో, ఫైల్ వర్క్ చాలా వుంటుంది. అలాగే ఫుల్ వైట్ అమౌంట్ లో ట్రాన్సాక్షన్ చేయడం అన్నది ఇంకా అలవాటు పడాల్సి వుండడం వంటివి ఇంకా టాలీవుడ్ కు పూర్తిగా అలవాటు పడాల్సి వుంది.
వి, నిశ్బబ్దం, ఒరేయ్ బుజ్జిగా, మిస్ ఇండియా సినిమాలు ఇఫ్పటికే దాదాపు నేరుగా ఓటిటి విడుదలలు ఫిక్స్ అయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో నితిన్-వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తయారవుతున్న రంగ్ దే సినిమాకు కూడా ఆఫర్ లెటర్ వచ్చింది. రేటు కోట్ చేయమంటూ జీ 5 సంస్థ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుంది అన్నది పక్కన పెడితే, జీ 5 ఏ మేరకు దీనికి అమౌంట్ ఆఫర్ చేస్తుందన్నది ఆలోచించాలి.
ఎందుకంటే రంగ్ దే కు థియేటర్ రైట్స్ ఆఫర్ నే 17 కోట్ల నుంచి 20 కోట్ల వరకు వుంది. నాన్ థియేటర్ కచ్చితంగా మరో పది నుంచి పన్నెండు కోట్లు రావడానికి అవకాశం వుంది. అంటే దాదాపు ముఫై కోట్లకు పైనే. జీ 5 ఆఫర్ ఎలా వుంటుందంటే ప్రొడక్షన్ కాస్ట్ ను డిటైల్డ్ గా ఇవ్వమని అడుగుతుంది. దానిపై 20 పర్సంట్ కలిపి ఆఫర్ చేస్తుంది. మరి ఇది నిర్మాతలకు నచ్చుతుందా? నచ్చదా? అన్నదాన్ని బట్టి వుంటుంది.
ఇదిలా వుంటే మరోపక్క మన హీరోలు నేరుగా ఓటిటికి వెళ్లడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. పైగా కరోనా కల్లోలం ముగిసి, థియేటర్లు తెరిచిన తరువాత సంక్రాంతికి రావాలని అనుకుంటోంది రంగ్ దే. ఇలాంటి టైమ్ లో ఓటిటికి ఇవ్వడానికి హీరో నితిన్ ఓకె అంటారా? ఏమో?