రంగస్థలం సినిమా ఈ ఏడాది తోలి బ్లాక్ బస్టర్. అందులో సందేహం లేదు. అంతే కాదు విడుదలయిన నాలుగు వారాలయినా అన్ని సెంటర్లలో ఇంకా షేర్ వసూలు చేసున్న సినిమా. అందులోనూ సందేహం లేదు. అన్నింటికి మించి ప్రతి ఒక్క బయ్యర్ కు మాంచి లాభాలు పండించిన సినిమా. అయితే ఈ సినిమాకు మూడో వారం నుంచి పబ్లిసిటీ ఆపేసినట్లు కనిపిస్తోంది.
నిజానికి ఇంత లాభాలు వచ్చిన తరువాత నిర్మాతలకు కూడా కోట్ల లాభాలు పండించిన తరువాత, ఇలా షేర్ వస్తున్నపుడు మరింత హడావుడి చేయడం, మరింత పబ్లిసిటీ చేయడం అన్నది కామన్. కానీ భరత్ అనే నేను విడుదలయిన దగ్గర నుంచి చూసుకుంటే రంగస్థలం హడావుడి చాలా తక్కువ కనిపిస్తోంది.
ఇంతకన్నా ఏం చేయగలం? అన్ని ఇంటర్వూలు అయిపోయాయి, అంత హడావుడి అయిపోయింది అని అనేయచ్చు. కానీ విడుదలయిన వారంలో రెండు సక్సెస్ మీట్ లు చేసారు భరత్ అనే నేను సినిమాకు. విడుదలయిన రెండో రోజు 100కోట్లు గ్రాస్, ఫస్ట్ వీక్ కు 160కోట్ల గ్రాస్ అంటూ హడావుడి చేస్తున్నారు. మరి ఇప్పటికి రంగస్థలం షేర్ నే వంద కోట్లు దాటేసింది. కానీ ఎక్కడా? ఓ ప్రకటన అన్నా లేదేం? ఇప్పటి గ్రాస్ చాలా పెద్ద మొత్తం అని తెలుస్తోంది. ఏదీ ఒక ప్రెస్ నోట్ అన్నా లేదే?
దీనికి కారణం భరత్ అనే నేను అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ కు మహేష్ బాబుతో, నమత్రతతో, కొరటాల శివతో మాంచి సాన్నిహిత్యం, అంతకు మించి బంధాలు వున్నాయి.
ఇప్పుడు మూడో వారం నుంచి రంగస్థలం సినిమాకు ఏమాత్రం హడావుడి ఎక్కువ చేసినా అది భరత్ అనే నేను మీద ప్రభావం చూపిస్తుంది. ఏ హడావుడి చేయకుండానే మాంచి షేర్ వస్తోంది. ఇంకా హడావుడి చేస్తే? ఉదాహరణకు ఏ రాజమండ్రిలోనో, తిరుపతిలోనో సక్సెస్ మీట్ పెడితే?
అది కచ్చితంగా భరత్ మీద ప్రభావం చూపిస్తుంది. దాంతో కొరటాల, మహేష్, నమత్రతో మైత్రీ బంధాలు దెబ్బతినే ప్రమాదం వుంది. పైగా మహేష్ తో సినిమా ఇప్పుడే ప్రకటించి వున్నారు. అందుకే రంగస్థలం విషయంలో అందరూ లాభాలు చేసుకున్నారు. తామూ లాభాలు చేసుకున్నారు. కనుక పబ్లిసిటీ హంగామా వదిలేసారు.