ఉన్నదీ పాయె.. ఉంచుకున్నదీ పాయె అన్నట్లు వుంది దర్శకుడి తేజ వ్యవహారం. నేనే రాజు నేనే మంత్రి వంటి హిట్ సినిమా ఇచ్చినా, ఇప్పటి దాకా మరో సినిమా స్టార్ట్ కాలేదు. సురేష్ మూవీస్ ను, వెంకటేష్ ను నమ్ముకుని కూర్చుంటే ఇప్పటి దాకా ఆ కథ ఓకె కావడం లేదు. సరే అది అలా వుంచి ఎన్టీఆర్ బయోపిక్ చేద్దాం అనుకుంటే అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు.
మళ్లీ కొత్తవాళ్లతో సినిమా చేద్దాం అంటే గతంలోని అనేకానేక చేదు అనుభవాలు వుండనే వున్నాయి. అందుకే స్టార్ తోడు లేకుండా సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యాడు.
కానీ యంగ్ బ్యాచ్ ఎవరూ తేజను దగ్గరకు రానిచ్చేరా లేరు. అందుకే ఇప్పుడు తన దగ్గర వున్న ఓ మాంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో హీరో నాగార్జున దగ్గరకు వెళ్దామని తేజ చూస్తున్నట్లు తెలుస్తోంది.
తేజ ఇప్పుడు నాగ్ కాంబినేషన్ కోసం చూస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి దాకా ఇంకా నాగ్ ను అప్రోచ్ కాలేదు. తేజ గురువు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం నాగ్ తో ఆఫీసర్ సినిమా చేస్తున్నారు. మరి ఆయన ఏమన్నా, మధ్యలో రాయబారం నడుపుతారేమో? లేదా తేజనే నాగ్ ఫ్రీ అయ్యాక కలుస్తారో? చూడాలి.