రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న సినిమా రంగస్థలం 1985బ్యాక్ డ్రాప్ లో తయారవుతున్న సినిమా ఇది.
ఈ సినిమా ఆడియో హక్కులు, విడియో సాంగ్స్ డిజిటల్ హక్కులను లహరి సంస్థకు ఇస్తున్నట్లు తెలిసింది. 1.60 కోట్లకు లహరి సంస్థ ఈ డీల్ ను క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి జీఎస్టీ అదనం.
ఇటీవలే మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లోని భరత్ అనే నేను సినిమా ఆడియో హక్కులు కూడా లహరి సంస్థ 2కోట్లు ప్లస్ జీఎస్టీ అదనం లెక్కన డీల్ క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆదిత్య సంస్థ ఈ మధ్యన సినిమా నిర్మాణంలోకి రావాలని ఎక్కువగా ప్రయత్నిస్తోంది.
ఆడియో వ్యవహారాలు చాలా వరకు తగ్గించేసుకుంది. ఖాకీ సినిమాను తెలుగులో అందించారు. మంచి విజయమే సాధించింది. దాంతో ఇక టాలీవుడ్ లో లహరి సంస్థనే ఇప్పుడు బిగ్ ప్లేయర్ గా మారింది. అందుకే చకచకా భారీ డీల్స్ క్లోజ్ చేస్తోంది.