రంగస్థలం జోరు ఫస్ట్ వీకెండ్ తొలి మూడు రోజులు క్లియర్ గా కనిపించింది. తొలి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా యాభై కోట్లు దాటేసింది. ఓవర్ సీస్, అదర్ ఏరియాలు, కర్ణాటక అన్నీ కలుపుకుంటే 55వరకు చేరుతోందని అంచనా. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తొలి మూడు రోజులకు 37.40 కోట్లు వసూలు చేసింది. దాదాపు 60నుంచి 70శాతం పెట్టుబడి మూడు రోజుల్లోనే వచ్చేసినట్లు.
సినిమా మొత్తం 80కోట్ల రేంజ్ లో మార్కెట్ చేసారు. వీటిలో కొన్ని ఏరియాలు డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చారు. కృష్ణ, గుంటూరు, తిరుపతి టౌన్, ఈస్ట్ నిర్మాతలే వుంచుకుని, కొందరు మిత్రుల సహకారంతో డిస్ట్రిబ్యూషన్ చేయించారు. అయినా ఆ ఏరియాలకు కూడా ఇంత అని అంచనా రేటు కట్టుకుని వుంచారు. ఆ లెక్కన చూసుకున్నా కూడా అన్ని ఏరియాల్లో 60నుంచి 70శాతం రికవరీ అయిపోయింది.
ఇక సోమవారం నుంచి ఎలా వుంటుందన్న దాని మీద టోటల్ రికవరీ, లాభాలు అన్నవి ఆధారపడి వుంటాయి. అనుకున్న ఫిగర్లకు అయితే చేరిపోతుందన్న ధీమా వుంది. అలాగే ఖర్చులు పోను కనీసం పది శాతం కమిషన్లు కిట్టుబాటు అవుతాయని బయ్యర్లు ధీమాగా వున్నారు.
కలెక్షన్ల వివరాలు
నైజాం…….. 10,05,00,000
సీడెడ్…….. 7,50,00,000
ఉత్తరాంధ్ర… 5,18,13,640
ఈస్ట్…. 3,50,00,000
వెస్ట్…. 2,71,65,000
కృష్ణ….. 2,80,00,000
గుంటూరు.. 4,25,00,000
నెల్లూరు…. 1,40,52,664