ఓ న్యూస్ ఛానెల్ కు చెందిన యాంకర్ రాధిక ఆత్మహత్య చేసుకుంది. కొన్నాళ్లుగా తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్న ఈ యాంకర్, నిన్న రాత్రి తన అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈమె హ్యాండ్ బ్యాగ్ లో సూసైడ్ నోట్ కూడా ఉంది. తను కేవలం మానసిక వత్తిడి వల్లే చనిపోతున్నానని, తన మరణానికి ఎవరూ కారణం కాదని అందులో ఉంది.
దాదాపు నాలుగేళ్లుగా రాధిక వ్యక్తిగత జీవితం తీవ్రమైన ఒడిదుడుకుల మధ్య ఉంది. ఈమధ్యే ఆమె భర్త నుంచి అయిష్టంగానే విడాకులు తీసుకుంది. పైగా ఆమెకు మతిస్థిమితం లేని కొడుకు ఉన్నాడు. తన సన్నిహితుల వద్ద ఎప్పుడూ వ్యక్తిగత విషయాలు చెప్పుకుంటూ బాధపడేది. ఈ క్రమంలో ఆమె తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.
చనిపోయే ముందు రాధిక చాలా గందరగోళంగా ఉన్నారని అపార్ట్ మెంట్ లో కొంతమంది చెబుతున్నారు. చిరాగ్గా అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించిన ఆమె, తన ఫ్లాట్ లోకి వెళ్లకుండా ఫాస్ట్ గా అపార్ట్ మెంట్ పైకి వెళ్లడం తమకు ఆశ్చర్యం కలిగించిందని, ఆ వెంటనే ఆమె అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకేసిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.