బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్ లు ఇచ్చిన డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో హీరో రవితేజ ఒక సినిమా ఓకె చేసిన సంగతి తెలిసిందే. ఈ నెలలోనే ఈ సినిమా సెట్ మీదకు వెళ్తోంది.
ఈ సినిమా కోసం కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకువచ్చారు. మాళవిక శర్మ అనే ఏడ్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ను తీసుకున్నారు. నాలుగయిదు ప్రొఫైల్స్ చూసి, ఆఖరికి ఈ అమ్మాయిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా జగపతిబాబు ఫిక్సయ్యాడు. ఇంకో అట్రాక్షన్ ఏమిటంటే, ఫిదా సినిమాకు మాంచి సంగీతం అందించిన శశికాంత్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు.
రవితేజ మార్కు ఎంటర్ టైన్ మెంట్ వుంటూనే, కళ్యాణ్ కృష్ణ తరహా ఫ్యామిలీ సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. మూడు నెలల్లో రెడీ చేసి పోస్ట్ సమ్మర్ టైమ్ కు విడుదలకు రెడీ చేయాలన్నది యూనిట్ ఆలోచన.