రవితేజ కూడా మహేష్ బాటలోనే

నిన్నటిదాకా నాలుగు పేపర్లు, రెండు మూడు చానెళ్లు, అన్న గీతలకు గీసుకుని కూర్చున్నారు సినిమా జనాలు. కానీ ఇప్పుడు తెలిసివచ్చినట్లుంది..అందర్నీ కలుపుకునిపోతే, విజయానికి మీడియా సహకారం ఇంతా అంతా కాదని. శ్రీమంతుడు మహేష్ బాబు…

నిన్నటిదాకా నాలుగు పేపర్లు, రెండు మూడు చానెళ్లు, అన్న గీతలకు గీసుకుని కూర్చున్నారు సినిమా జనాలు. కానీ ఇప్పుడు తెలిసివచ్చినట్లుంది..అందర్నీ కలుపుకునిపోతే, విజయానికి మీడియా సహకారం ఇంతా అంతా కాదని. శ్రీమంతుడు మహేష్ బాబు అదే బాటలో పయనించారు.

ఇప్పుడు రవితేజ కూడా అదే బాట పట్టారు. గతంలో రవితేజ లిమిటెడ్ మీడియాతోనే ఇంట్రాక్ట్ అయ్యేవారు. ముఖ్యంగా వెబ్ మీడియా అంటే కాస్త దూరంగా వుండే వారు. అలాంటిది ఇప్పుడు మొత్తం మీడియాను కలిసి, కిక్ 2 పై ముచ్చటించాలని డిసైడ్ అయ్యాడు. ఈ మార్పు మంచిదే.

పెద్ద హీరోలం మేము, అనుకుని, మీడియాతో అంటీ ముట్టనట్లు వుండే మిగిలిన వారు కూడా మారితే మరీ మంచిదే.