లడ్డూబేబీ

సైజ్ జీరో అని పేరు పెట్టారు కానీ, నరేష్ లడ్డూబాబు మాదిరిగా లడ్డూబేబీ అని పేరు పెట్టేసి వుంటే బాగుండేదేమో? సైజ్ జీరో స్టిల్స్ చూస్తుంటే జనాలకు నరేష్ లడ్డూబాబే గుర్తుకువస్తోంది. Advertisement అయితే,…

సైజ్ జీరో అని పేరు పెట్టారు కానీ, నరేష్ లడ్డూబాబు మాదిరిగా లడ్డూబేబీ అని పేరు పెట్టేసి వుంటే బాగుండేదేమో? సైజ్ జీరో స్టిల్స్ చూస్తుంటే జనాలకు నరేష్ లడ్డూబాబే గుర్తుకువస్తోంది.

అయితే, ఇది కథంతా వేరంట. విపరీతమైన లావున్న అమ్మాయి. ఆమెకు మోడల్ కావాలన్న కోరిక, దానికి సాయం పట్టే ట్రయినర్ కమ్ హీరో, ఈ లైన్ లో నడుస్తుంది కథ. హీరో ట్రయినింగ్ తో పాతిక కిలోలు తగ్గి, మెరుపుతీగ మోడల్ గా ఎలా తయారైందో అన్నది కాన్సెప్ట్ అంట. బాగానే వుంది.

కాన్సెప్ట్ మారినా కామెడీగా చెబితే, కొబ్బరిబొండాం, కితకితలు, లడ్డూబాబు సినిమాలే గుర్తుకు వస్తాయి. కాస్త లావాటిజనాల బాధలు, భావోద్వేగాలు జోడిస్తే, డిఫరెంట్ అనిపించుకుంటుంది. కానీ మరి ఇంతకీ దర్శకేంద్రుడి తనయుడు ఏ బాటలో వెళ్లారో?