సినిమా చేసిన ప్రతి నిర్మాతతో ప్రాబ్లమ్ రావడం హీరో రవితేజకు అలవాటుగా మారిపోయిందా? లేక అనుకోకుండా జరుగుతోందా? పివిపి నిర్మాతగా సినిమా చేసినపుడు, కోటిరూపాయిల పారితోషికం బకాయి దగ్గర సమస్య వచ్చిందని టాలీవుడ్ లో గుసగుస వుంది.
ఇద్దరి నడుమ ఏకవచన సంబోధం అంతా స్నేహం వుండీ సమస్య వచ్చిందని వినికిడి. తరువాత రాక్ లైన్ వెంకటేష్ తోనూ ఇబ్బంది వచ్చింది. తొలిసారిగా రవితేజ తన స్వంత డబ్బు నలభై లక్షలు ఆ సినిమా కోసం ఖర్చు చేసి, ఓ పాట చిత్రీకరణ చేసుకున్నాడని టాక్. రాక్ లైన్ వెంకటేష్ బడ్జెట్ ఎక్కువైందని మొండికేయడమే ఇందుకు కారణం అని గుసగుస.
ఇప్పుడు కిక్ 2 కళ్యాణ్ రామ్ తోనూ సమస్యే. అది ఎందుకో తెలియదు. మొన్నటికి మొన్న ఆడియో ప్లాటినమ్ ఫంక్షన్ కు వక్కతం వంశీ చెప్పి రప్పించినా, నిర్మాత కళ్యాణ్ రామ్ తో ఎడమొహం పెడమొహంగానే గడిపాడు. మరి ఇప్పుడు రాథామోహన్ తో బెంగాల్ టైగర్ చేస్తు్న్నాడు. దీని కథ ఎలా ముగుస్తుందో?