ఈనెల నుంచే రవితేజ కొత్త సినిమా

రాజా ది గ్రేట్ వచ్చి వెళ్లిపోయింది. నెక్ట్స్ రాబోతున్న 'టచ్ చేసి చూడు' సినిమాను దాదాపు పూర్తిచేశాడు రవితేజ. ఈ రెండు సినిమాల తర్వాత ఈ హీరో షార్ట్ గ్యాప్ తీసుకుంటాడని ఊహించారు. కానీ…

రాజా ది గ్రేట్ వచ్చి వెళ్లిపోయింది. నెక్ట్స్ రాబోతున్న 'టచ్ చేసి చూడు' సినిమాను దాదాపు పూర్తిచేశాడు రవితేజ. ఈ రెండు సినిమాల తర్వాత ఈ హీరో షార్ట్ గ్యాప్ తీసుకుంటాడని ఊహించారు. కానీ ఈ నెల్లోనే కొత్త సినిమా ప్రారంభించబోతున్నాడు రవితేజ. 

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్ టైనర్ కు ఓకే చెప్పాడు రవి. ఈనెల ఆఖరి వారం నుంచే ఈ సినిమా మొదలవుతుంది. పూజా కార్యక్రమాలు, రెగ్యులర్ షూటింగ్ అన్నీ ఒకేసారి కానిచ్చేస్తారు. అక్కడ్నుంచి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ కూడా ఫిక్స్ చేశారు.

విలేజ్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి స్క్రీన్ ప్లే లాక్ చేశారు. రవితేజ అడిగినంత ఇవ్వడానికి నిర్మాత రామ్ తళ్లూరి ఒప్పుకోవడంతో ఈ ప్రాజెక్టు సెట్ అయింది. లేదంటే దీని స్థానంలో శ్రీనువైట్ల సినిమా ఉండేది.