రవితేజ ‘సుందర్ పాండ్యన్’?

సుందరపాండ్యన్ తమిళనాట హిట్ అయిన సినిమా. ఈ సినిమాను చాలా వరకు అక్కడి జనాలు మరిచిపోయే వుంటారు. కానీ పాపం బోలెడు డబ్బులు పెట్టి హక్కులు కొన్న తెలుగు నిర్మాతలు మాత్రం మరిచిపోవడం లేదు.…

సుందరపాండ్యన్ తమిళనాట హిట్ అయిన సినిమా. ఈ సినిమాను చాలా వరకు అక్కడి జనాలు మరిచిపోయే వుంటారు. కానీ పాపం బోలెడు డబ్బులు పెట్టి హక్కులు కొన్న తెలుగు నిర్మాతలు మాత్రం మరిచిపోవడం లేదు. దాన్ని ఎవరితో తీయాలా అని సతమతం అవుతున్నారు. దాని కెపాసిటీ, బడ్డెట్ కు సరిపడా హీరో కావాలి. 

అందుకే ఇప్పుడు ఈ సుందరపాండ్యన్ బంతి, హీరో రవితేజ కోర్టులోకి చేరిందని వినికిడి. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం..సినిమా సెట్ మీదకు వెళ్లిపోతుంది. రవితేజ ఇప్పటికే కిక్ 2, బెంగాల్ టైగర్ సినిమాలు ఒప్పుకుని వున్నాడు. ఆ కమిట్ మెంట్ లు అయితే కానీ ఇది మొదలవడం కష్టం.