Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రెడ్ ఆఫర్ కు జెమిని నో?

రెడ్ ఆఫర్ కు జెమిని నో?

ఇస్మార్ట్ శంకర్ తో బౌన్స్ బ్యాక్ అయిన హీరో రామ్  లేటెస్ట్ సినిమా రెడ్. స్వంత బ్యానర్ పై వీలయినంత వెల్ ప్లాన్డ్ గా తీసిన సినిమా. కరోనా లేకుండా వుండి వుంటే థియేటర్ల అమ్మకాలు బాగానే జరిగి మంచి లాభాలు చేసుకునేవారు. కానీ అలా లేకుండా అయిపోయింది. అయినా నష్టం లేదు. నాన్ థియేటర్ రైట్స్ నే బాగా వచ్చేసాయి. అందువల్ల ఎప్పుడు విడుదల చేసుకున్నాసమస్య లేదు. అందుకే ఇన్నాళ్లు ఆగారు.

కానీ ఇప్పుడు పరిస్థితి అంచనాకు అందడం లేదు. అందుకే మొత్తం సినిమాను తీసుకోమని జెమిని సన్ నెక్ట్స్ ను అడిగారు. వాళ్లను ఎందుకు అడగడం అంటే ఇప్పటికే శాటిలైట్ రైట్స్ ను వాళ్లకే అమ్మేసారు. డిజిటల్ కూడా వాళ్లకే ఇచ్చినట్లు బోగట్టా. అందువల్ల థియేటర్ లో విడుదల చేయకుండా మొత్తం మీకే ఇచ్చేస్తాము, నెట్ ఫ్లిక్స్ తో ఎలాగూ టై అప్ వుంది కదా..వేసుకోండి అని రెడ్ నిర్మాతలు జెమినికి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కానీ దానికి జెమిని సన్ నెక్ట్స్ టీమ్ నో చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కాదు అలా ఓటిటి కి డైరక్ట్ గా ఇచ్చే ఆలోచన చేస్తే, శాటిలైట్ అమౌంట్ తగ్గించాల్సి వుంటుందని రివర్స్ లో వచ్చినట్లు బోగట్టా. దాంతో ఇక రెడ్ టీమ్ ఓటిటి ఆలోచన మానుకుని, బుద్దిగా థియేటర్లలో వదిలేందుకు డిసైడ్ అయిపోయింది. దసరా లేదా దీపావళి టైమ్ లో థియేటర్లలోకి రెడ్ ను పంపించాలని చూస్తున్నట్లు బోగట్టా.

విశాఖ వస్తా, అందరినీ కలుస్తా

సీబీఐ విచార‌ణ.. జ‌న‌సేనానికి ఊహించని షాక్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?