చిన్న సినిమాలతోనే బిజీ అయిపోయి చేతిలో అరడజనుకి పైగా చిత్రాలతో తీరిక లేకుండా ఉన్న రెజీనా అవసరమైతే గ్లామరస్‌గా కనిపిస్తానని, ఎక్స్‌పోజింగ్‌కి వ్యతిరేకం కాదని చెప్పింది. అంతే కాదు… సీన్ డిమాండ్ చేస్తే లిప్ లాక్స్‌కి కూడా రెడీ అంది. అన్నట్టుగానే ఆమె ‘రారా కృష్ణయ్య’ సినిమాలో సందీప్ కిషన్‌తో లిప్ లాక్ సీన్ చేసింది.
జగపతిబాబు ముఖ్య పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రం తనకి మరో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ అవుతుందని సందీప్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ విజయంతో సందీప్ కెరీర్ జోరందుకోలేదు. అతని సినిమా డి.కె. బోస్ ఇంకా విడుదల కోసం ఇబ్బందులు పడుతూనే ఉంది. రెండు, మూడు విజయాలు వరుసగా సాధిస్తే తప్ప ఇప్పుడు సందీప్ కిషన్ హీరోగా ఒక రేంజ్‌కి రాలేడు.
ఈ నేపథ్యంలో అతను ఆచి తూచి అడుగులు వేస్తూ జాగ్రత్తగా సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు. మరోవైపు రెజీనా కూడా అగ్ర నటుల సరసన అవకాశాలు రావడం లేదని డీలా పడిపోకుండా వచ్చిన అవకాశాలతోనే సంతృప్తి పడుతూ చిన్న చిత్రాలకి కూడా పూర్తి సహకారం అందిస్తోంది.