అది అసంపూర్ణ స్వతంత్ర భారతం
నివురుగప్పిన నియంత పాలనం
రాజకీయ కీలుబొమ్మలాటలు
అధికారుల తోలు బొమ్మలాటలు
వెరసీ చైతన్య రహిత జనభారతం
తెలుగు వాడంటే చులకన
బూజు పట్టిన పట్వారీ విధానాలు
కొలువైన సింగం
విశ్వ విఖ్యాత నట సింగం జూలు విదిల్చింది
ప్రజల పక్షాన నిలిచింది
ఏలిక పాలకులపై పంజా విసిరింది
సమూల రాజకీయ ప్రక్షాలన చేసింది
అడవి రాముడు గా తిరిగిన ఆ సింగం
బడుగు జనుల కోసం ఊరూరా తిరిగింది
ప్రతి తెలుగు వాడు ఒక సింగమని
అత్మీయతే కాదు
ఆత్మ గౌరవం కూడా వాడికి ఉందని
సహనమే కాదు సాహసం ఉందని
ప్రపంచానికి చాటింది
డిల్లీ సింహాసనం కదిలేలా ఘీంకరించిది
నేనున్నానంటూ తన జాతికి బలం భరోసా ఇచ్చింది
ఈ నేల అయుస్సు ఉండేదాకా
ఈ జాతి గుండె లో కొలువై ఉంటుంది ఆ సింగం
మీగడ త్రినాధ రావు