రెజీనా.. వదిలించుకున్నదెవరిని?

సినిమాల కన్నా తన కామెంట్స్ తో వార్తల్లో నిలవడమే అలవాటుగా చేసుకుంది రెజీనా. ప్రతిభ ఉన్నా.. పెద్దగా అవకాశాలు లేని ఈ తమిళభామ.. ఈ మధ్య స్టేట్ మెంట్స్ తో వార్తల్లో నిలుస్తోంది. కృష్ణవంశీ…

సినిమాల కన్నా తన కామెంట్స్ తో వార్తల్లో నిలవడమే అలవాటుగా చేసుకుంది రెజీనా. ప్రతిభ ఉన్నా.. పెద్దగా అవకాశాలు లేని ఈ తమిళభామ.. ఈ మధ్య స్టేట్ మెంట్స్ తో వార్తల్లో నిలుస్తోంది. కృష్ణవంశీ సినిమాలో అవకాశం వస్తే.. డబ్బులు తీసుకోకుండా అయినా, చేస్తానని రెజీనా చెప్పుకొచ్చింది. ఆ మాటలతో కృష్ణవంశీని  బుట్టలో పడేయాలని చూసిందో ఏమో! ఆ తర్వాత తను అలా అనలేదని మరో స్టేట్ మెంట్. 

పారితోషకం తీసుకోకుండా చేయడానికి తనకేం పిచ్చా.. అన్నట్టుగా మరో స్టేట్ మెంట్ ఇచ్చింది రెజీనా.ఆ సంగతలా ఉంటే… ఒక ఇంటర్వ్యూలో రెజీనా తన లవ్ లైఫ్ గురించి, బాయ్ ఫ్రెండ్స్ గురించి చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతానికి తను సింగిల్ అని రెజీనా అంటోంది. గతంలో బాయ్ ఫ్రెండ్స్అయితే ఉండే వాళ్లు అని, వాళ్లను తనే ఇప్పుడు పక్కన పెట్టాను అని రెజీనా చెప్పింది. వాళ్లు తనను వదిలేయడం కాదు, తనే వారిని పక్కన పెట్టాను అని రెజీనా ఇక్కడ స్ట్రెస్ చేయడం విశేషం. 

తనంటే ఆ బాయ్ ఫ్రెండ్స్ పడి చస్తారని చెప్పుకోవడం రెజీనా ఉద్దేశమని స్పష్టం అవుతోంది. మరి రెజీనానే పక్కన పెట్టిందని అనుకున్నా.. ఇంతకీ సదరు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు అనేదీ ఆసక్తికరమైన అంశమే. మెగా కుటుంబానికి చెందిన హీరో సాయి ధరమ్ తేజతో రెజీనా డేటింగ్ లో ఉందని కొన్నాళ్ల కిందట  గాసిప్స్ షికారు చేశాయి. మరి రెజీనా వదిలించుకున్నది అతడినేనా?