రామ్ చరణ్ కోసం మేర్లపాక గాంధీ రాసుకున్న 'కృష్ణార్జున యుద్ధం' కథని ఏరి కోరి మరీ చేసాడు నాని. అక్కడ రిజెక్ట్ అయిందంటే కథలో ఏదో ప్రాబ్లమ్ వుందని చూడకుండా, తన మార్కెట్ డైనమిక్స్‌కి ఇది సరిపోతుందనుకుని చేసేసాడు. అదే నాని విజయ పరంపరకి ముందుగా బ్రేకులు వేసింది. అక్కడితో అయినా పాఠం నేర్చుకోకుండా అల్లు అర్జున్ దగ్గర రిజెక్ట్ అయిన 'గ్యాంగ్‌లీడర్' కథని నాని చేసేసాడు.
అల్లు అర్జున్ దగ్గర 'గ్యాంగ్‌లీడర్' కథ పలుమార్లు రిజెక్ట్ అయింది. సెకండ్ హాఫ్ సరిపోవడం లేదంటూ అల్లు అర్జున్ అభ్యంతరం చెబుతూ పోయాడు. విక్రమ్ కుమార్ తనని కన్విన్స్ చేయలేకపోవడంతో త్రివిక్రమ్‌తో సినిమా అనౌన్స్ చేసాడు. దాంతో అదే కథతో నానిని కలిసి వెంటనే సినిమా ఓకే చేయించుకున్నాడు. మరి అంతవరకు సమస్యగా మారిన సెకండ్ హాఫ్‌పై వర్క్ చేసారా?
గ్యాంగ్‌లీడర్ చూస్తేనే సెకండ్ హాఫ్‌లోని సమస్యలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఆడవాళ్ల తరఫు రివెంజ్ అంటూ మొదలు పెట్టి వారిపై ఎలాంటి సానుభూతి కలగకుండా చేసి, విలన్‌ని కూడా వీక్ చేసేయడంతో సినిమా పల్టీ కొట్టింది. కనీసం పతాక సన్నివేశం పాత్రోచితంగా వుంటే బాగుండేదేమో కానీ అక్కడా హీరోతో ఫైట్ చేయించి మొత్తంగా నీరుగార్చేయడంతో గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ వద్ద ఆరంభ శూరత్వంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.