Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రెండయినా రకుల్ కు నోప్రాబ్లమ్ అంట

రెండయినా రకుల్ కు నోప్రాబ్లమ్ అంట

రకుల్ ప్రీత్ సింగ్ లక్కీ మాత్రమే కాదు..ప్లానింగ్ కూడా పెర్ ఫెక్టే. ఫ్లాపులు పలకరిస్తు్నాయి, రేటు తగ్గిపోతోంది అనుకున్నా కూడా, అంతలోనే బిజీ అయిపోయింది. కోరి కోరి మహేష్ సినిమా ఆఫర్ వచ్చింది. డేట్లు సమస్య అవుతాయేమో అన్న అనుమానాలు కలిగాయి. అదే యూనిట్ వద్దే సాయిధరమ్ తేజ కోసం తీసుకున్న డేట్లు వున్నాయి కనుక చల్తా అనుకున్నారు. 

సాయి ధరమ్ కు వేరే హీరోయిన్ ను సెట్ చేసుకోవచ్చు అని కూడా వినిపించింది. అయితే రకుల్ మాత్రం, ఏదో విధంగా మధ్యలో ఖాళీగా వున్న డేట్లు అవీ సర్దుబాటు చేసి, రెండు సినిమాలు చేసేస్తానని మాటిచ్చేసిందట. ఇటు మహేష్ సినిమాకు అటు సాయి ధరమ్ సినిమాకు కాస్త ఎడం ఎలాగూ వుంటుంది కాబట్టి, ఈ లోగా రామ్ చరణ్ ధృవ ఓ కొలిక్కి వచ్చేస్తుంది. 

ఇవి కాక బోయపాటి శీను డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ తో చేయాల్సిన సినిమా వుండనే వుంది. వీటన్నింటికి తోడు ఇతర భాషా సినిమాలు వుండనే వున్నాయి. మొత్తం మీద ఎక్కడా గ్యాప్ లేకుండా సినిమాలు మీద సినిమాలు ఓకె చేస్తోంది రకుల్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?