సినిమా ప్రారంభించకుండానే సంక్రాంతికి విడుదల అంటూ రుమాలు వేసేసాడు బాలయ్య బాబు. డైరక్టర్ క్రిష్ కాంబినేషన్ లో చేస్తున్న శాతకర్ణి సినిమా షూట్ పార్ట్ మాగ్జిమమ్ వచ్చే నెలాఖరు లోపే ఫినిష్ అయిపోతుందట. క్రిష్ వెల్ ప్లాన్డ్ గా ఫినిష్ చేసేస్తున్నాట. పైగా ఈ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ కావడంతో వాళ్లకి మాగ్గిమమ్ టైమ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. సో ఆగస్టు నుంచి అయిదునెలలు గ్రాఫిక్స్ వారికి టైమ్ వుండేలా ప్లాన్ చేసారట. ఈ లోగా తన పోస్టు ప్రొడక్షన్ పనులు తాను చేసుకుంటారట.
మరి అదే సంక్రాంతికి రావాల్సిన చిరు 150వ సినిమా వ్యవహారం మాత్రం రివర్స్ లో వుంది. సినిమా టాకీ పార్ట్ షూట్ బాగానే సాగుతోంది కానీ, ఇంతవరకు హీరోయిన్ జాడ లేదు. నిజానికి సినిమాలో హీరోయిన్ కు పార్ట్ తక్కువ అని వినికిడి. అయినా కూడా దాన్నీ ఫినిష్ చేయాలంటే, కాంబినేషన్ సీన్లు వుండనే వుంటాయి. కదా? అయిదు నెలలు సమయం వుంది కాబట్టి, ఎప్పుడు హీరోయిన్ ఓకె అయిపోయినా, పెద్ద కష్టం కాదు అన్నది ఓ వెర్షన్. మరి దాన్ని బట్టి చిరు సినిమా ఫినిషింగ్ టైమ్ అన్నది ఆధారపడి వుంటుంది అంటున్నారు.
ఇటు మెగాభిమానులు, అటు బాలయ్య అభిమానులు ఈ రెండు సినిమాల మీద బోలెడు ఫోకస్ తో వున్నారు. ఒకరిది వందో సినిమా రెండవది నూటయాభై సినిమా. ఒకటి పొలిటికల్ బ్యాక్ గ్రవుండ్..మరొకటి హిస్టారికల్ బ్యాక్ గ్రవుండ్. అందుకే ఈ రెండు సంక్రాంతి సమ ఉజ్జీలు. కానీ ఇక్కడ ఓ సమస్య వుంది. ఇలాంటి రెండు సినిమాలు ఒకేసారి రావడం అంటే థియేటర్ల సమస్యే ఓ రేంజ్ లో వుంటుంది.
రెండింటికీ చెరో వెయ్యి స్క్రీన్ లకు పైనే కావాలి. థియేటర్ల విషయంలో మెగాస్టార్ కు కాస్త పై చేయి వుంటుంది. ఎందుకంటే అరవింద్, ఆయనో అసోసియేట్ అయ్యే దిల్ రాజు చేతిలో చాలా ధియేటర్లు వుంటాయి. కానీ అదే సమయంలో సురేష్, ఆశియన్ సునీల్ వంటివారి థియేటర్లు బాలయ్యకు రెడీగా వుంటాయి. కానీ ఆంధ్రలో బాలయ్య పార్టీది పవర్. అందువల్ల అక్కడ సరిపడా స్క్రీన్ లు బాలయ్య సినిమాకు రావాల్సిందే. లేకుంటే లేని పోని తలకాయనొప్పులు వచ్చే ప్రమాదం వుంది.
అందువల్ల ఇన్ని సమస్యలు అవసరమా? పైగా ఫ్యాన్స్, కలెక్షన్లు, రికార్డుల వంటి వ్యవహారాలు వుంటాయి. అందుకే సంక్రాంతికి కాస్త ముందుగానో, వెనుకగానో ఇద్లరిలో ఒకరు సర్దుకోవడం బెటర్ అన్నది టాలీవుడ్ వర్గాల అభిప్రాయం. బాలయ్య సినిమా ఎలాగూ చకచకా ఫినిష్ అయిపోతోంది కాబట్టి, మెగాస్టార్ సినిమా ఓ వారం అటు ఇటుగా సర్దుకుంటుందేమో అన్న వదంతులు వినిపిస్తున్నాయి.