మెగాస్టార్ చిరంజీవి తన నూటాయాభై వ సినిమా మీద తీసుకుంటున్న జాగ్రత్తలు ఇన్నీ అన్నీ కావు. మొదటి రోజు షూట్ జరిగాక రష్ చూసుకున్నారు. దానికి మీనింగ్ వుంది. చాన్నాళ్ల తరువాత స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కాబట్టి, ఎలా వున్నారో, ఎలా వుంటుందో చూసుకోవాలని అనిపిస్తుంది కాబట్టి.
కానీ ఇండస్ట్రీ గుసగుసలు వేరుగా వున్నాయి. దాదాపు ఎప్పటికప్పుడు రష్ చూసుకుంటున్నారని టాలీవుడ్ గుసగుసల సారాంశం. స్క్రిప్ట్ ప్రకారం సీన్ రావడం సంగతి అలా వుంచితే, టేకింగ్, తన లుక్స్ పెర్ ఫెక్ట్ గా వున్నాయా లేవా అని మెగాస్టార్ తరుచు రష్ చూసుకుంటున్నారని వదంతులు వినిపిస్తున్నాయి.
నిజానికి వివి వినాయక్ స్టార్ డైరక్టర్. ఎన్నో హిట్ లు అతని ఖాతాలో వున్నాయి. టేకింగ్ లో ఈనాటి మాస్ డైరక్టర్లకు ఎందరికో వినయ్ ఆదర్శం. మరి అలాంటి వినయ్ ను డైరక్టర్ గా ఎంచుకుని కూడా చిరు ఇలా ఎందుకు చేస్తున్నట్లో? అపనమ్మకమా? అతి జాగ్రత్తా?
ఖర్చుపై ఆరా?
ఇదిలా వుంటే తొలిసారి ప్రొడక్షన్ లో అడుగు పెట్టింది చిరు ఫ్యామిలీ. గతంలో అరవింద్, నాగబాబు ప్రొడక్షన్ చేసారు కానీ చిరు కాదు. ఇప్పుడు నిత్యం అవుతున్న ఖర్చుపై కూడా బాగా స్క్రీనింగ్ చేస్తు్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫుడ్ ఏర్పాట్లు, ఇతరత్రా సదుపాయాల వ్యవహారాలను తరచు ప్రశ్నిస్తున్నట్లు వినిపిస్తోంది. ముఖ్యంగా వినాయక్ క్రూ అంటే కాస్త ఫుడ్ ఖర్చు ఎక్కువ వుంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వున్నాయి. వీటిపై కూడా చరణ్ ఆరా తీసినట్లు టాలీవుడ్ జనం చెప్పుకుంటున్నారు