Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రెండు కోట్లు లాక్ అయిపోయాయి

రెండు కోట్లు లాక్ అయిపోయాయి

హీరోలు, డైరక్టర్ల డేట్ ల కోసం డబ్బులు అడ్వాన్స్ గా అందించడం అవి బ్లాక్ అయిపోయి నిర్మాతలు వడ్డీ కట్టుకోవడం, హీరోలు ఎంజాయ్ చేయడం టాలీవుడ్ లో మామూలే. 

మైత్రీ సంస్థ అడ్వాన్స్ లు పవన్ దగ్గర ప్రభాస్ దగ్గర ఇలాగే వుండిపోయాయి. ఆ సంగతి అలా వుంచితే ఓ మిడిల్ రేంజ్ నిర్మాత, ఓ మిడ్ రేంజ్ హీరోతో సినిమా తీయాలనుకున్నారు. 

ఆ హీరోకి కాస్త హిందీ డబ్బింగ్ మార్కెట్ వుంది. అందుకోసం ఆశపడి ముందుకు వెళ్లారు. రెండు కోట్లు అడ్వాన్స్ అడిగారు ఇచ్చారు. కానీ ఈ లోగా సదరు హీరోను డిజాస్టర్ పలకరించింది.

దాంతో ఆ హీరో రేంజ్ డైరక్టర్లు అంతా అటు చూడడం మానేసారు. వేరే భాష డైరక్టర్లను తీసుకువచ్చారు. కథలు చెప్పించారు. ఏవీ సెట్ కావడం లేదు. మొత్తానికి సినిమా అన్నది దూరంగా వుండిపోయింది. 

అలా అని హీరో అడ్వాన్స్ వెనక్కు ఇస్తారా? సినిమా చేస్తా..కథ, డైరక్టర్ ను పట్టుకురండి అంటారు. ఆయన వుంటే...అన్న సామెత మాదిరిగా తయారైంది ఆ నిర్మాత వ్యవహారం.

కథ, డైరక్టర్ సెట్ కారు. డబ్బులు లైన్ లో పడి సినిమాగా మారవు. లేదా వెనక్కు రావు. ఈ లోగా రెండు కోట్లకు వడ్డీలు కట్టుకుంటూ కూర్చోవడమే.

ఆ హీరో మాత్రం ఆ రెండు కోట్లు ఎక్కడో అక్కడ పెట్టుబడి పెట్టి, అంతకు అంతా పెంచుకుంటూ వుంటారు. టాలీవుడ్ లో అంతే.. టాలీవుడ్ లో అంతే.

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా