రెండు వారాలు ఫ్రీ కోసం దిల్ రాజు యత్నాలు

నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా, నితిన్ హీరోగా,  నిర్మిస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి వంటి మంచి సినిమాలు అందించి, హిట్ కొట్టిన నేపథ్యంలో మళ్లీ…

నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా, నితిన్ హీరోగా,  నిర్మిస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి వంటి మంచి సినిమాలు అందించి, హిట్ కొట్టిన నేపథ్యంలో మళ్లీ అలాంటి ఫీల్ గుడ్ ఫ్యామిలీ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఎలాగైనా బొమ్మరిల్లు విడుదల డేట్ అయిన ఆగస్టు 9 కి విడుదల చేయాలని యూనిట్ ను పరుగులు పెట్టిస్తున్నారు.

అయితే ఆగస్టు తొమ్మిదిన కానీ, ఆ తరువాత వారం కానీ మరే సినిమా వుండకుండా కూడా దిల్ రాజు ప్రయత్నిస్తున్నారట. సవ్యసాచి సినిమా ఆగస్టు 9 లేదా 10 విడుదల అనుకున్నారు. వాళ్లను ఆగస్టు 3 కు రమ్మని దిల్ రాజు కోరినట్లు తెలుస్తోంది. కానీ ఆ సినిమా రెడీ కావడం మీద ఇంకా సందేహాలు వున్నాయి. 

మరోపక్క విజయ్ దేవరకొండ తో గీతా సంస్థ నిర్మించిన గీతగోవిందం సినిమా ను ఆగస్టు 15న విడుదల చేద్దాం అనుకుంటున్నారు. కానీ వన్ వీక్ వెనక్కు వెళ్లమని దిల్ రాజు కోరుతున్నట్లు తెలుస్తోంది. అంటే రెండు వారాలు థియేటర్లలో ఏ సినిమా లేకుండా చూసుకొవాలనే పెద్ద సినిమాల స్ట్రాటజీని దిల్ రాజు తన మీడియం సినిమా కోసం ఫాలో అవుతున్నారన్నమాట.