తన ఇంటి సమస్య కాబట్టి మెగాస్టార్ చిరంజీవి సులువుగానే పరిష్కరించేసారు. మేనల్లుడి సినిమాను ఓ వారం, అల్లుడి సినిమాను మరోవారం సర్దుబాటు చేసి, పోటీ లేకుండా చేసారు. కానీ అంతవరకు బాగానే వుంది. పాపం, ముందుగా షెడ్యూలు చేసుకున్న లవర్ సినిమాను ఇప్పుడు ఓ వారం వెనక్కు జరగమంటున్నారట.
రాజ్ తరుణ్ లవర్ సినిమాను జూలై 12 విడుదల అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కు మెగా అల్లుడి సినిమా విజేత వస్తోంది. అందుకే లవర్ సినిమాను ఓ వారం వెనక్కు వెళ్లమని కోరుతున్నారట. అంటే మెగా అల్లుడి సినిమాకు సోలో ఓపెనింగ్ వుండాలన్నమాట.
వాస్తవానికి అసలు జూలై ఫస్ట్ వీక్ ను గోపీచంద్ పంతం సినిమా కోసం మూడు నెలల క్రితం ప్రకటించారు. కానీ ఇప్పుడు మెగా మేనల్లుడి సినిమా వచ్చి వాలింది. ఆ తరువాత వచ్చిన విజేత వెనక్కు వెళ్లి, లవర్ ను వెనక్కు నెడుతోంది. మొత్తం మీద లవర్ సినిమాను జూలై 20న విడుేదల చేయడానికి దిల్ రాజు డిసైడ్ అయ్యారట.
ఇదిలా వుంటే. ఇండస్ట్రీలో మాత్రం ఆసక్తికర గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ కాబట్టి నిర్మాతలు పైకి ఏమీ అనలేక లోలోపల గొణుక్కుంటున్నారు. ఎవరు ఏ డేట్ వేసుకున్నా, సడెన్ గా వచ్చి పడుతున్నారని, ఏమీ చేయలేక సైలంట్ గా వుండాల్సి వస్తోందని నిర్మాతలు కామెంట్లు చేస్తున్నారు.