ఇదిగో 'రిపబ్లిక్'…అదిగో రిలీజ్ అంటూ వార్తలు తెగ వినిపిస్తున్నాయి. దేవా కట్టా-సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో తయారవుతున్న ఈ సినిమాతో జీ టీవీ/జీ 5 కు మొదటి నుంచీ అనుబంధం వుంది.
అందువల్ల ఎలాగూ ఆ ఛానెల్ లోనే, ఆ డిజిటల్ ప్లాట్ ఫారమ్ మీదే విడుదలవుతుంది. అయితే థియేటర్లలో విడుదలయిన తరువాతే తప్ప ముందు అయితే కాదు.
నిజానికి ఇప్పటికిప్పుడు విడుదలకు రిపబ్లిక్ సిద్దంగా లేదు. ఇంకా కనీసం నెల రోజులు వర్క్ పెండింగ్ లో వుందని తెలుస్తోంది. అందువల్ల ఈ సినిమా విడుదల డేట్ అన్న విషయం ఇంకా డిస్కషన్ కే రావడం లేదు.
వన్స్ షూటింగ్ లు ప్రారంభం కావాలి. నెలరోజుల్లో వర్క్ ఫినిష్ చేయాలి. అంటే జూలై నెలాఖరుకు కానీ క్లారిటీ రాదు. అందువల్ల రిపబ్లిక్ డేట్ గ్యాసిప్ లు వినిపిస్తూనే వుంటాయి.