కరోనా రెండో దశ సంక్షోభం నుంచి టాలీవుడ్ త్వరగానే తేరుకుంటోంది. జూన్ లోనే షూటింగ్ లు ప్రారంభించే దిశగా నిర్మాతలు ప్లానింగ్ ప్రారంభించారు.
జూలై 1 నుంచి తెలంగాణలో థియేటర్లు ఓపెన్ అవుతాయని, యాభై శాతం కాకుండా నేరుగా పూర్తి స్థాయిలోనే థియేటర్లు తెరుచుకుంటాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఆంధ్రలో మాత్రం యాభై శాతంతోనే థియేటర్లు తెరచుకుంటాయని తెలుస్తోంది.
యాభై శాతం తో థియేటర్లు ఓపెన్ అయినా సినిమాలు రిలీజ్ లు ప్లాన్ చేయాలని నిర్మాతలు డిసైడ్ అయి వున్నారు. జూన్ 15 నుంచి జూలై 15 వరకు రెండు డజన్ల సినిమాలు రెడీ అయిపోవడానికి సిద్దంగా వున్నాయి. ఇవన్నీ జూలై రెండో వారం నుంచి స్క్రీన్ మీదకు వచ్చేస్తాయి.
విరాటపర్వం, టక్ జగదీష్, లవ్ స్టోరీ లాంటి క్రేజీ ప్రాజెక్టులు కూడా ఈ జాబితాలో వున్నాయి. రిపబ్లిక్, వరుడు కావలెను, లక్ష్య, పాగల్, ఇలా కాస్త ఆసక్తికరమైన క్రేజీ సినిమాలు చాలా ఫినిషింగ్ ప్లాన్ ల్లో వున్నాయి.