ఎక్స్ క్లూజివ్ – ధనుష్ డైరక్ట్ తెలుగు సినిమా

తెలుగు టాప్ హీరోలు, డైరక్టర్లు బిజీ అయిపోయారు. తెలుగులో వున్న పెద్ద నిర్మాతలకు హీరోలు దొరకడం లేదు. అలా అని సినిమాలు చేయడం మానేయలేరు. ఏళ్ల తరబడి సినిమాలు తీయకుండా వుండలేరు. అందుకే అదర్…

తెలుగు టాప్ హీరోలు, డైరక్టర్లు బిజీ అయిపోయారు. తెలుగులో వున్న పెద్ద నిర్మాతలకు హీరోలు దొరకడం లేదు. అలా అని సినిమాలు చేయడం మానేయలేరు. ఏళ్ల తరబడి సినిమాలు తీయకుండా వుండలేరు. అందుకే అదర్ లాంగ్వేజ్ హీరోల వైపు చూస్తున్నారు.  

అదర్ లాంగ్వేజ్ డైరక్టర్ ల కోసం చూస్తున్నారు. ఇటీవలే నిర్మాత దిల్ రాజు తమిళ డైరక్టర్ శంకర్ తో తెలుగు సినిమా ప్లాన్ చేసారు. అలాగే తమిళ హీరో విజయ్ తో తెలుగు సినిమా ప్లాన్ చేసారు. 

ఇప్పుడు అదే లైన్ లో తమిళ హీరో ధనుష్ ను కూడా తెలుగులో డైరక్ట్ గా పరిచయం చేయాలనే ఆలోచన జరుగుతోంది. ఓ పెద్ద బ్యానర్, ఓ పెద్ద డైరక్టర్ కాంబినేషన్ లో ధనుష్ తో రెండు మూడు భాషల్లో సినిమా చేసే ప్లాన్ జరుగుతోంది. ఈ సినిమాకు మరో సీనియర్ హీరో కూడా అవసరం ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వన్స్ కాంబినేషన్ సెట్ కాగానే, థియేటర్లు ఓపెన్ కాగానే ధనుష్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం వుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, బ్యానర్, డైరక్టర్ ప్రయత్నం తెలిసి, సబ్జెక్ట్ లైన్ తెలిసి ఓ టాప్ హీరో కూడా ఈ ప్రాజెక్టును తాను చేస్తానని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.