నవీన సెక్సాలజిస్టులు ఫోర్ ప్లే గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. శృంగారంలో ఫోర్ ప్లేది అత్యంత కీలక పాత్ర అని వారు విడమరిచి చెబుతూ ఉంటారు. ఫోర్ ప్లే లేకుండా శృంగారం పూర్తి కాదని, ఫోర్ ప్లే లేని సెక్స్ సెక్సే కాదని వారు అంటూ ఉంటారు.
శృంగారాన్ని స్త్రీ కోణం నుంచి చూసినా.. ఫోర్ ప్లేతో ఆమెను ప్రేరేపించినప్పుడే ఆమెకు పూర్తి తృప్తి దక్కుతుందని వారు వివరిస్తూ ఉంటారు. సెక్స్ లో రియల్ సెక్స్ టైమ్ తక్కువ అయినా ఫర్వాలేదు, వీలైనంత ఎక్కువ సమయం ఫోర్ ప్లే ఉండాలని వారు అంటారు. ఓవరాల్ ఫోర్ ప్లే నే సెక్స్ లో కీలకం అని నవీన తరం సెక్సాలజిస్టులు చెబుతూ ఉంటారు.
ఇక ఇదే అంశం గురించి ప్రాచీన కామసూత్ర ఏం చెప్పిందనే అంశాన్ని కూడా శృంగారశాస్త్ర నిపుణులు ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప గిఫ్ట్ కామసూత్ర. అందులో కూడా ఫోర్ ప్లే గురించి ప్రస్తావన ఉందని శృంగార రంగ పరిశోధకులు చెబుతున్నారు. కామసూత్ర గ్రంథంలో కేవలం విభిన్న శృంగార భంగిమల గురించే కాకుండా.. ఫోర్ ప్లే గురించి కూడా ప్రస్తావన ఉందని దాన్ని అధ్యయనం చేసిన వారు చెబుతున్నారు.
శృంగారాన్ని కౌగిలితో ప్రారంభించాలని కామసూత్రలో పేర్కొన్నారట. ఫోర్ ప్లే కూడా కౌగిలితోనే ప్రారంభం అవుతుంది. పరస్పరం కౌగిలించిన తర్వాత స్త్రీ శరీరాన్ని సంపూర్ణంగా తడమడాన్ని కామసూత్రలో ప్రస్తావించారట. శృంగారానికి సన్నద్ధం కావడంలో భాగంగా.. స్త్రీ శరీరంలోని అంగాంగాన్నీ తడమడాన్ని కామసూత్రలో ప్రస్తావించారు. అంత కన్నా గొప్ప ఫోర్ ప్లే లేదని నవీన సెక్సాలజిస్టులు చెబుతున్నారు. ఈ విషయంలో ఎలాంటి సంకోచం లేకుండా పార్ట్ పార్ట్ నూ చేతులతో టచ్ చేసుకోవడం గొప్ప శృంగార సన్నద్ధత అవుతుంది.
ఇక సెన్సువల్ కిస్ ల ప్రస్తావన కూడా కామసూత్రలోని తదుపరి అంకం. గాఢంగా కాకుండా.. సున్నితంగా శరీర ఆసాంతాన్నీ చుంభించడాన్ని కూడా కామసూత్రలో ప్రముఖంగా పేర్కొన్నారట.
ఆ పై శృంగార ప్రక్రియలో గోళ్లు, పళ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయని కామసూత్ర చెబుతోంది. వీటిని మరీ రాక్షసంగా ప్రయోగించుకోవడం కాదు కానీ, సున్నితంగా వాటిని ప్రయోగిస్తూ శృంగారాస్వాదనను పతాక స్థాయికి తీసుకెళ్లవచ్చని కామసూత్ర వివరిస్తోంది. ప్రత్యేకించి పరస్పరం పళ్లను సున్నితంగా ప్రయోగించడం మోస్ట్ ఎరోటిక్ అని కామసూత్ర సూచిస్తోంది.