ఆర్ఎఫ్ సీ లో శంకరాభరణం

కోనవెంకట్, గీతాంజలిన నిర్మాత సత్యనారాయణ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా శంకరాభరణం. హిందీ చిత్రం ఫస్ గయా ఒబామాకు ఫ్రీమేక్. నిఖిల్ నందిత జోడీగా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి ది స్పెషల్ రోల్. …

కోనవెంకట్, గీతాంజలిన నిర్మాత సత్యనారాయణ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా శంకరాభరణం. హిందీ చిత్రం ఫస్ గయా ఒబామాకు ఫ్రీమేక్. నిఖిల్ నందిత జోడీగా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి ది స్పెషల్ రోల్. 

ఈ సినిమా ఇప్పుడు అవుట్ ఆఫ్ తెలుగు స్టేట్స్ నుంచి షూటింగ్ జరుపుకుని, హైదరాబాద్ చేరింది. ఆర్ఎఫ్ సి లో ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుగుతోంది. అక్టోబర్ కు ఎలాగైనా విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకోవడంతో, ఎక్కడా గ్యాప్ ఇవ్వడం లేదు. 

ఆఖరికి సండేలు కూడా. పైగా సినిమా షూటింగ్ డేస్ కూడా ఎక్కువే..సుమారు 70 రోజులు. అందుకే గ్యాప్ లేకుండా కానిచ్చేస్తున్నారు. ఫస్ గయా ఒబామా స్ఫూర్తిగా ఫన్, ఫ్యామిలీఎంటర్ టైన్ మెంట్ తొ పాటు చిన్న ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ వున్న లైన్ తయారు చేసారు కోన వెంకట్ అని వినికిడి.