రాజమౌళి..ఎన్టీఆర్..చరణ్ ల కాంబినేషన్ లో తయారవుతున్న ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా పడింది. అది తెలిసిందే. సంక్రాంతికి బరిలోకి వస్తుందని వార్తలు వున్నాయి. అవీ తెలిసిందే. కానీ సంక్రాంతికి వస్తుందా? ఏప్రిల్ లో విడుదల అన్నది కొత్త పాయింట్.
అక్టోబర్ నెలాఖరుకు ఏడు భాషల ఫస్ట్ కాపీలు రెడీ అయిపోతాయని డిస్ట్రిబ్యూటర్లకు వున్న సమాచారం. విడుదల అన్నది పరిస్థితులను బట్టి, టికెట్ రేట్లను బట్టి ఇలా చాలా వున్నాయి.
కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం డిసెంబర్ నెలాఖరుకు కానీ సిజి వర్క్ లతో సహా కాపీలు రెడీ కావు అని తెలుస్తోంది. అయినా కూడా సంక్రాంతికి విడుదల చేసుకోవచ్చు. అయితే రాజమౌళి మాత్రం తన ఓటు సమ్మర్ కే అని అంటున్నారని తెలుస్తోంది.
కాదూ కూడదు అంటే సంక్రాంతికి వేసుకుంటే తనకు అభ్యంతరం లేదని, తన అభిప్రాయం మాత్రం ఏప్రిల్ 2022 కే అని ఆయన నిర్మాతకు క్లారిటీ ఇచ్చేసారని తెలుస్తోంది.
ఏప్రిల్ నాటికి కరోనా పూర్తిగా కనుమరుగు కావడం, వరల్డ్ థియేటర్ వ్యవస్థ కుదుటపడడం, అలాగే ఇక్కడ టికెట్ రేట్ల వ్యవహారం తేలడం అన్నీ పరిష్కారం అవుతాయని అందువల్ల అదే బెటర్ అనే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.