రాజమౌళి..ఎన్టీఆర్..చరణ్ కాంబినేషన్ లో నిర్మాత డివివి దానయ్య నిర్మించిన సినిమా ఆర్ఆర్ఆర్. దాదాపు రెండేళ్లకు పైగా నిర్మాణంలో వున్న సినిమా.
ఇప్పటకే ఒకటికి మూడు సార్లు రిలీజ్ డేట్ లు మారిన సినిమా. ఈ సినిమా నిర్మాణానికి రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఖర్చువుతుందని గతంలో వినిపించింది. అయితే అన్ని ఖర్చులు, వడ్డీలు అన్నీ కలిపి అయిదు వందల కోట్లకు చేరిపోయినట్లు తెలుస్తోంది.
అందువల్ల విడుదల నాటికి మరీ ప్రాఫిటబుల్ వెంచర్ కాదని, విడుదలయిన తరుువాత ఓవర్ ఫ్లోస్ ను బట్టే అసలు లాభాలు ఆధారపడి వున్నాయని తెలుస్తోంది. పైగా ఈ సినిమాను హిందీలో విక్రయించలేదు. నేరుగా నిర్మాతనే విడుదల చేసుకుంటున్నారు. అక్కడ మంచి మొత్తాలు వస్తే అంతకు అంతా లాభాలు వచ్చినట్లు. అదే ఆశతో వున్నారు నిర్మాత దానయ్య.
సినిమాకు నాన్ థియేటర్ రూపంలో 225 కోట్లు ఆదాయం వచ్చింది. థియేటర్ ఆదాయం ఇంత అని ఇంకా పూర్తిగా లెక్కలు తేలలేదు. ప్రస్తుతానికి ఓవర్ సీస్, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక హక్కులు ఇచ్చేసారు. హిందీ లో నేరుగా విడుదల చేసుకుంటున్నారు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు వున్నాయి.
దర్శకుడు రాజమౌళికి దేశవ్యాప్తంగా వున్న పేరు, క్రేజ్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా మీద అంచనాలు పెంచేసాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోలు ఈ సినిమా మీద రెండేళ్లకు పైగా కాలం వుండిపోయారు.