మోస్ట్ అవైటింగ్ మూవీ ఆఫ్ టాలీవుడ్ ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ అక్టోబర్ 13 అంటూ మరోసారి మేకింగ్ విడియో సాక్షిగా చెప్పేసారు. దీంతో ఆర్ఆర్ఆర్ విడుదల పక్కాఅంటూ వార్తలు వినిపించడం ప్రారంభమైంది.
కానీ యూనిట్ తో పరిచయం వున్న విశ్వసనీయ వర్గాల బోగట్టా వేరుగా. అక్టోబర్ 13న విడుదల అన్నది ఇప్పటికీ అనుమానమే అన్నది ఇన్ సైడ్ వర్గాల సమాచారం.
మరి ఎందుకు డేట్ ను అంతలా హడావుడి చేస్తున్నారు అంటే అసలు కథ వేరే వుందని తెలుస్తోంది. ఈ సినిమాకు రకరకాలుగా కొనుగోలు దారులు వున్నారు. వాళ్లలో పెన్ స్టూడియోస్ ఒకటి.
ఆ సంస్థ సుమారు 100 కోట్లు ఆర్ఆర్ఆర్ కు అడ్వాన్స్ గా ఇచ్చిందని తెలుస్తోంది. ఆ సంస్థకు నిర్మాణ సంస్థతో వున్న లీగల్ అగ్రిమెంట్ ప్రకారం అక్టోబర్ 13న విడుదల కావాల్సి వుంది. ఆ మేరకు వత్తిడి వస్తోంది.
అందుకే డేట్ ను పదే పదే ప్రకటిస్తున్నారని, కానీ ఈ లోగా ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా యుఎస్, ఆస్ట్రేలియా, యుకె, దుబాయ్ అలాగే ఇండియాలో మహరాష్ట్ర ఇలా ఎక్కడ కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా సమస్య ఏర్పడినా అది చూపించి,వాయిదా వేసుకోవచ్చు అనే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే అమెరికాలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. యూరప్ లో సినిమా షూట్ కు వెళ్లాల్సి వుంది. అందుకు అవకశాలు ఎలా వుంటాయో తెలియదు.
ఇలా ఏ ఒక్క కారణం కలిసి వచ్చినా, పెన్ స్టూడియోస్ కు చెప్పడానికి అవకాశం వుంటుంది. అప్పుడు డిసెంబర్ మూడో వారానికి సినిమాను వాయిదావేసుకునే అవకాశం దొరకుతుందన్నది ఆలోచన అంటూ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తోంది.