ఇది వరకూ ఒక విదేశీ బాయ్ ఫ్రెండ్ తో షికారు చేసింది నటి శ్రుతి హాసన్. అతడు ఇండియా వచ్చాడొకసారి. తన ప్రియుడిని తండ్రి కమల్ కు కూడా పరిచయం చేసినట్టుగా ఉంది శ్రుతి. త్వరలోనే వారు పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో గట్టిగా ప్రచారం జరిగింది.
కొన్నాళ్లు పాటు శ్రుతితో కలిసి ఇండియాలో విహరించాడు ఆమె ప్రియుడు. అప్పట్లో వీరిద్దరూ ఒక ఫారెన్ కంట్రీలో కలిసి ఉంటున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో కానీ.. శ్రుతి హాసన్ బ్రేకప్ వార్తలు వచ్చాయి. ఆ ప్రేమకథను అలా ముగించిన శ్రుతి.. రెండేళ్లుగా మరో వ్యక్తితో డేట్ లో ఉంది.
ఈ క్రమంలో ప్రస్తుతం అది సహజీవనం వరకూ వచ్చిందని టాక్. శంతను హజారిక అనే వ్యక్తితో శ్రుతి హాసన్ ప్రస్తుతం ప్రేమాయణం సాగిస్తోంది. ఈ విషయాన్ని ఆమె దాచడం లేదు. అప్పుడప్పుడు తామిద్దరం కలిసి ఉన్న ఫొటోలను, సెల్ఫీలను పోస్టు చేస్తూ ఉంది. ఈ క్రమంలో వీరి సహజీవన అంశం కూడా స్పష్టం అవుతూ ఉంది.
శ్రుతి హాసన్ ప్రస్తుతం శంతనుతో కలిసే ఉంటోందని తెలుస్తోంది. రెండో వేవ్ కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో అయితే.. వీరిద్దరూ పూర్తిగా ఒకే ఇంట్లో బంధీలయ్యారట! లాక్ డౌన్ సమయంలో వీరి సహజీవనం మరింత గాఢంగా మారినట్టుగా ఉంది. మామూలుగా సహజీవనం చేస్తూ ఉండి ఉంటే, కనీసం వర్క్ కోసం అయినా వేర్వేరు ఊర్లలో ఉండాల్సి వచ్చేది. లాక్ డౌన్ నేపథ్యంలో వీరిద్దరూ పూర్తిగా ఒకే ఇంటికే పరిమితం అయ్యారని శ్రుతి పోస్టులను బట్టే తెలుస్తోంది.
లాక్ డౌన్ అనంతరం ఇప్పుడిప్పుడు షూటింగులు మొదలయ్యాయి. శ్రుతి కూడా పని మొదలుపెట్టింది. ఈ క్రమంలో చిన్న గ్యాప్ దొరికితే ప్రియుడితో కలిసి బయట విహరించింది శ్రుతి. అందుకు సంబంధించి ఫొటోలను తన ఇన్ స్టా స్టేటస్ లో అప్ డేట్ చేసింది. మొత్తానికి తన లవ్ స్టోరీలను బాహాటంగానే నడిపే అలవాటున్న శ్రుతి తాజా ప్రేమకథ విషయంలో కూడా చాలా ఓపెన్ గానే ఉంటోంది!