Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇకపై ఎన్టీఆర్, చరణ్ భారమంతా జక్కన్నదే!

ఇకపై ఎన్టీఆర్, చరణ్ భారమంతా జక్కన్నదే!

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇప్పుడు ఒకే స్టేజ్ లో ఉన్నారు. కాకపోతే ఎన్టీఆర్ కాస్త సేఫ్ సైడ్ ఉన్నాడనుకోండి, రామ్ చరణ్ కి మాత్రం రంగస్థలం ఇచ్చిన కిక్కుని పూర్తిగా మర్చిపోయేలా చేసింది వినయ విధేయ రామ. దీంతో ఇప్పుడీ ఇద్దరు హీరోల సక్సెస్ భారం పూర్తిగా రాజమౌళిపైనే పడింది. సహజంగా సక్సెస్ ఊపులో ఉంటే... రాజమౌళి సినిమా RRRలో మరింత సంతోషంగా పాల్గొనేవాళ్లు ఎన్టీఆర్, రామ్ చరణ్.

కానీ తారక్ కి అరవింద సమేత ఆశించిన ఫలితాన్నివ్వలేదు. మరీ రాయలసీమ వాళ్లని అంత క్రూరంగా చూపుతారా, సినిమా కోసం లేని ఫ్యాక్షన్ ని ఉన్నట్టు భయపెడతారా అంటూ విమర్శలొచ్చాయి. ఇప్పుడు రామ్ చరణ్ అంతకంటే పెద్ద ప్రమాదంలో పడ్డాడు. వినయ విధేయ రామతో ఏకంగా బాలయ్య ప్లేస్ ని భర్తీ చేస్తున్నాడు.

సోషల్ మీడియాలో కామెడీ కంటెంట్ అంతా రామ్ చరణ్ సెంట్రిక్ గా జరుగుతోంది. బోయపాటి కత్తులు తెచ్చుకున్నాడు సరే, తెలిసి తెలిసీ వాటికి రామ్ చరణ్ సాన బెట్టడం ఏంటని, మరీ ఇంత చెత్త సినిమా ఎలా ఒప్పుకున్నాడని మెగా ఫ్యాన్స్ సైతం మొత్తుకుంటున్నారు. ఫ్యాన్సే కాదు, చరణ్ కూడా పూర్తిగా డిజప్పాయింట్ అయ్యాడని తెలుస్తోంది.

ఈ ఫ్లాప్ మూడ్ లోనుంచి బైటపడాలంటే మాంచి హిట్ కొట్టాలి. అందుకోసం కసిగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్, చరణ్ రాజమౌళి పైనే భారం వేశారు. సక్సెస్ తో ఈ ఇద్దరు యంగ్ హీరోలను మళ్లీ ట్రాక్ లో పడేయాల్సిన బాధ్యత జక్కన్నపైనే ఉంది. ప్రస్తుతానికి ఆర్-ఆర్-ఆర్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఎన్టీఆర్-చరణ్ మధ్య ఓ యాక్షన్ బ్లాక్ షూట్ చేశారు. త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలవుతుంది. 

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?