ఆర్ఆర్ఆర్-జూలై 30 పక్కన పెట్టారా?

2020లో రాబోయే అత్యంత ఆసక్తికరమైన చిత్రమైన ఆర్ఆర్ఆర్ గురించి లేటెస్ట్ అప్ డేట్స్ బయటకు వచ్చాయి. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరు అన్నది వెల్లడించారు. వాస్తవానికి ఈ విషయం ఎక్స్ క్లూజివ్ గా ఓ…

2020లో రాబోయే అత్యంత ఆసక్తికరమైన చిత్రమైన ఆర్ఆర్ఆర్ గురించి లేటెస్ట్ అప్ డేట్స్ బయటకు వచ్చాయి. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరు అన్నది వెల్లడించారు. వాస్తవానికి ఈ విషయం ఎక్స్ క్లూజివ్ గా ఓ రోజు ముందే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. ఆ విషయం అలా వుంచితే, 2020 విడుదల అంటూ ప్రకటించారు.

కానీ ఆర్ఆర్ఆర్ విడుదల డేట్ ను చాలా నెలలకు ముందే ప్రకటించారు. జూలై 30 అంటూ. కానీ సినిమా రకరకాల కారణాల వల్ల, భారీ ప్రాజెక్టు కావడంతోనూ ఆలస్యం అవుతోందని ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే వున్నాయి. 2020 దసరాకు విడుదల ప్లాన్ చేస్తున్నారని, అది తప్పితే 2021లోనే అని కూడా వార్తలు వచ్చాయి.

లేటెస్ట్ ఆర్ఆర్ఆర్ యూనిట్ నుంచి వచ్చిన ప్రకటనలో జూలై 30 విడుదల అన్నది ఎగిరిపోయింది. 2020 విడుదల అన్నది మాత్రమే వుంది. దీనిని బట్టి సినిమా విడుదల కాస్త ఆలస్యం కావచ్చు అంటూ వినిపిస్తున్న వార్తలు పక్కా అని అర్థం అవుతోంది. మే రెండోవారం వరకు హీరోల డేట్ లు ఈ సినిమాకే వున్నాయి.

అక్కడి నుంచి జూలై 30 అంటే జస్ట్ రెండు నెలలకు కాస్త ఎక్కువ. కానీ ఇంత భారీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కు, పది భాషల్లో విడుదల అవుతున్నందున ప్రచారానికి ఆ టైమ్ సరిపోతుందా? అన్నది అనుమానం.అందుకే సరైన డేట్ ను ఫిక్స్ చేసి అనౌన్స్ చేసే వరకు 2020 విడుదల అనే అనుకోవాలి.